గత కొంతకాలంగా టాలీవుడ్‌లో పలువివాదస్పద సంఘటనలు తలెత్తుతున్నాయన్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా శ్రీరెడ్డి యవ్వారం ప్రతి నటీనటులకు తలనొప్పిగా తయారైందట. ఇకపోతే ఆ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉదంతం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కాస్టింగ్ కౌచ్ పోరాటం ద్వారా నటి శ్రీరెడ్డి వెలుగులోకి వచ్చింది.

 

 

ఇదే కాకుండా మీడియాలో కూడా శ్రీరెడ్డి అనేక సంచలన విషయాలు బయటపెట్టింది.. అంతటితో ఊరుకోకుండా ఆ తర్వాత కూడా శ్రీరెడ్డి తన సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇదే కాకుండా కొద్దిరోజుల క్రితం నటి కరాటే కళ్యాణి, డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ పై, తన ఫేస్ బుక్ పేజీలో దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ, తాను ఈ మధ్యన సైలెంట్ గా ఉంటున్నందున కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్ లాంటి వ్యక్తులు రెచ్చిపోతున్నారని కామెంట్స్ చేసింది  శ్రీరెడ్డి...

 

 

ఇదిలా ఉండగా నటి కరాటే కళ్యాణి, శ్రీరెడ్డిల మధ్య మాటల యుద్దం ఒకానొక సమయంలో హద్దులు కూడా దాటింది. ఇంతటితో ఆగిపోతుందనుకున్న రగడ మళ్లీ రాజుకుంది.. తాజాగా సీసీఎస్‌ సైబర్ క్రైమ్‌లో శ్రీ రెడ్డిపై నటి కరాటే కల్యాణి పోలీస్ కేస్ పెట్టారు. తనను శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అసభ్యకరంగా తిడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు కరాటే కల్యాణి.

 

 

దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ విచారణ చేసి, నిందితులపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారట.. కాగా.. గతంలో కూడా కరాటే కల్యాణి.. తనపై సోషల్ మీడియాలో వస్తోన్న అభ్యంతరకమైన పోస్ట్‌లు, కామెంట్స్ పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కావాలనే ఎవరో ఇలా చేయిస్తున్నారని అందులో పేర్కొన్నారు... ఇకపోతే శ్రీరెడ్డి ఎప్పుడు ఏదో ఒక వివాదంతో మీడియా నోళ్లలో నానడం అలవాటు చేసుకుందని ఇప్పటికే పలువురు విమర్శలు చేస్తున్న విషయం తెలిందే. ఇలా ఎందరో నటి నటులను టార్గెట్ చేస్తూ ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తనకే తెలియదనే పేరు మూటగట్టుకుంది శ్రీరెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి: