అనాగరిక కాలంలో నెలసరి అంటే అరిష్టంగా భావించేవాళ్ళు. ఇప్పుడిప్పుడే నెలసరి పై మహిళలకు అవగాహన పెరుగుతుంది. నెలసరి గురించి కొంచెం ఓపెన్గా మాట్లాడగలుగుతున్నారు. అక్కడ అక్కడ  కొంతమంది మహిళలు ఇప్పటికీ నెలసరి గురించి బయటకు చెప్పడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే మహిళల్లో నెలసరి గురించి ఓ స్వామీజీ నీచ బుద్దిని  బయటపెట్టారు. నెలసరి తో ఉన్న విద్యార్థుల పట్ల అనాగరికంగా వ్యవహరించిన గుజరాత్ లోని శ్రీ సహజానంద గర్ల్స్ ఘటన వెనుక ఈ   స్వామి నీచ బుద్ది  ఉన్నట్లు తెలుస్తోంది. పురాణాల కాలం నుంచి నెలసరితో ఉన్న మహిళలు కొన్ని కట్టుబాట్లు పాటిస్తూ ఉంటారు అని.. అలా పాటించని వాళ్లను ద్వేషించినా తప్పు లేదు అంటూ స్వామినారాయణ్ మందిర్ మతబోధకుడు కృష్ణ స్వరూప్ దాస్ జీ  వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కాగా  శ్రీ సహజానంద గర్ల్స్ ఇన్స్టిట్యూట్ స్వామి నారాయణ్ టెంపుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

 


 రుతుక్రమం సమయంలో మహిళలందరూ... వండి పెట్టిన ఆహారం తిన్నావారు  వచ్చే జన్మలో ఎత్తుకుపోతారు అంటూ ఈ స్వామీజీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.అందుకే నెలసరి తో ఉన్న మహిళలు వంట చేయకూడదు అని అయినా సంచలన వ్యాఖ్యలు చేశారు, ఒకవేళ పురాణాలు చెబుతున్న  శాస్త్రాలు పట్టించుకోకుండా మహిళలు నెలసరి లో కూడా భర్తలకు  వండి పెడితే... అలాంటి మహిళలు మరుజన్మలో కుక్కలుగా  పుడతారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నెలసరి సమయంలో భార్యలను భర్తలు వంటలు చేయనివ్వకూడదని.. మగవాళ్ళంతా వంట నేర్చుకొని నెలసరి సమయంలో.. మహిళలు వంట చేయకుండా ధర్మం పాటించేలా చూడాలి అంటూ ఆయన సూచించారు. 

 

 

 కాగా స్థానిక మీడియా స్వామీజీ వ్యాఖ్యలపై వివరణ కోరగా అక్కడి సిబ్బంది మాత్రం వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు. కాగా శ్రీ సహజానంద గర్ల్స్ ఇన్స్టిట్యూట్లో నెలసరి సమయంలో విద్యార్థునిలు.. అందరితో కలిసి మెలిసి కాకుండా వేరుగా భోజనం చేయాలి అనే నిబంధన ఉంది. అయితే కొంత మంది విద్యార్థులు మాత్రం దానిని పాటించలేదు. దీంతో అక్కడి హాస్పిటల్ నుండి 60 మంది విద్యార్థులకు బాత్ రూమ్ లోకి  తీసుకెళ్లి నెలసరి అయ్యిందా లేదా అని లో దుస్తులను  చెక్  చేశారు. కాగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఈ ఘటనలో నలుగురు అరెస్ట్ చేశారు పోలీసులు. కాలేజీ యాజమాన్యం తీరు పై సీరియస్ అయిన జాతీయ మహిళా కమిషన్ ఏడు మంది సభ్యులతో విచారణ కమిటీ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: