ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన జోక్యంతోనైనా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అవుతుందా ?, ఇప్పుడు ఇదే అంశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది . అసెంబ్లీ ఆమోదించిన  పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను మండలి సెలెక్ట్ కమిటీ కి పంపాలని నిర్ణయించిన విషయం తెల్సిందే . మండలి చైర్మన్ నిర్ణయం పట్ల  ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా మండలిని రద్దు చేయాలని నిర్ణయించింది . ఈ మేరకు పార్లమెంట్ కు నివేదించింది . అయినా మండలి నిర్ణయం మేరకు  సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలంటూ కార్యదర్శిని చైర్మన్ ఆదేశించారు .

 

అయితే చైర్మన్ ఆదేశాలను కార్యదర్శి భేఖాతర్ చేస్తూ రెండుసార్లు ఫైల్ వెనక్కి తిప్పిపంపిన నేపధ్యం లో గవర్నర్ తో చైర్మన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది .   నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేశారని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న  ఆరోపణలను  మండలి చైర్మన్ షరీఫ్ , తోసిపుచ్చారు . నిబంధనల ప్రకారమే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు . సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని రెండుసార్లు ఆదేశించిన మండలి కార్యదర్శి ఫైల్ వెనక్కి పంపడాన్ని చైర్మన్ తీవ్రంగా తప్పుపట్టారు . చైర్మన్ ఆదేశించిన రూలింగ్ చేయకుండా కార్యదర్శి తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు .

 

మండలిలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నర్ కు వివరించిన చైర్మన్ , కార్యదర్శి పై చర్య తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు . గవర్నర్ తో మండలి చైర్మన్ భేటీ అనంతరం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అవుతుందా ? అన్నదే ఇప్పుడు ప్రశార్ధకంగా మారింది . సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు ఇప్పటికే కార్యదర్శి సుముఖంగా లేక  రెండు సార్లు  ఫైల్ వెనక్కి పంపిన నేపధ్యం లో గవర్నర్ జోక్యం చేసుకుంటారా ? లేదా ?? అన్న సందేహాలు కూడా లేకపోలేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: