అత్త వారింటి వేధింపులు తట్టుకోలేక ఓ కన్నడ గాయని పుట్టింట్లో ఆత్మహత్య చేసుకుంది . తన ఆత్మహత్య కు గల కారణాలను వివరిస్తూ సూసైడ్ నోట్  రాసింది .  తన ఆత్మహత్య కు భర్త , అత్తమామ , ఆడపడుచే  కారణమని వెల్లడించిన గాయని సుష్మితా  రాజేష్ , వారి శిక్ష పడేవిధంగా చూడాలని , లేకపోతే తన ఆత్మ శాంతించదని పేర్కొంది . గాయని   సుష్మితా రాజేష్ కు 2018లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శరత్ కుమార్ తో వివాహం జరిగింది .  ఒక శుభకార్యం లో సుష్మితాను చూసి ఇష్టపడిన శరత్ కుమార్ , పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు . 

 

పెళ్లి అయినప్పటి నుంచి తల్లితండ్రులు , ఆడపడుచు మాట విని శరత్ కుమార్ ,  సుష్మితా రాజేష్ ను శారీరకంగా తీవ్ర చిత్ర హింసలకు గురిచేసేవాడు . చివరకు  సుష్మితా రాజేష్ అత్తవారింట్లో ఆత్మహత్య కూడా చేసుకోవడం ఇష్టం లేక , పుట్టింటికి వచ్చి బలవన్మరణాని పాల్పడింది . తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందే సోదరుడికి వాట్సాప్ సందేశాన్ని పంపిన  సుష్మితా రాజేష్ , చనిపోయేముందు సూసైడ్ నోట్ కూడా రాసింది . అమ్మ ...  నన్ను క్షమించు అంటూ తన భర్త చిత్రహింసలు పెట్టిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించింది . ఒక్క మాట మాట్లాడిన ఇంట్లో నుంచి బయటకు వెళ్లు అంటూ బెదిరించేవారని సుష్మిత చెప్పుకొచ్చింది .

 

తన భర్త చాల మొండివాడని , తన మాట అసలు వినేవాడు కాదని అంది . ఇక తన అంత్యక్రియలు సొంతూళ్లో నిర్వహించాలని కోరుకుంది .  సుష్మిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శరత్ కుమార్ అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: