దంత పరిశుభ్రతపై చాలా మందికి అవగాహన ఉండదు. ఏదో ఆదరాబాదరాగా తోమిస్తే అయిందనిపిస్తారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. నోటి దుర్వాసన వల్ల వ్యక్తిగతంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈ సమస్యలకు పరిష్కారంగా మార్కెట్లోకి ఈ బ్రష్ వచ్చేసింది. దీని ధర కేవలం రూ. 2300 మాత్రమే.

 

టూత్ బ్రష్ ధర సాధారణంగా పాతిక రూపాయల వరకూ ఉంటుంది. ఇంకాస్త బ్రాండెడ్ అనుకుంటే రూ. 50. మహా అయితే రూ. 100.. మరి ఈ బ్రష్ కు రూ. 2300 ఎందుకు అంటారా.. ఎందుకంటే..దీంతో మీరు బ్రష్ చేయనక్కర్లేదు.. నోటిలో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే అదే చేసుకుంటుంది.

 

ఈ బ్రష్ 230gf.cm కంటే ఎక్కువ టార్క్‌తో నిమిషానికి 31,000 సార్లు కదులుతుంది. మనం సరిగ్గా కడుక్కుంటున్నామో లేదో చెబుతుంది. బీపీ, నిద్ర వివరాలను చెప్పే ఫిట్ బిట్‌లాగా దీన్ని బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. మీరు సరిగా బ్రష్ చేస్తున్నదీ లేనిదీ కూడా ఇది చెప్పేస్తుంది. ఇందుకోసం బ్లూటూత్ ద్వారా ఎంఐ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ యాప్‌కు కనెక్ట్ అయితే సరిపోతుంది.

 

ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ను ఒకసారి చార్జ్ పెడితే 18 రోజులు వాడుకోవచ్చు. అంతే కాదు.. రోజువారీగా, వారంవారీగా, నెలవారీగా ఫలితాలను కూడా రికార్డు చేసుకోవచ్చు. చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ ఈ బ్రష్ ను భారత మార్కెట్లోకి తెస్తోంది. 2018లోనే గ్లోబల్ మార్కెట్లో దీనిని విడుదల చేసిన షియోమీ ఈ నెల 20న భారత్‌లోని వినియోగదారులకు పరిచయం చేయబోతోంది. చైనాలో ఇప్పటికే లక్షల మందిని వీటిని వాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: