నవ్వుతూ బతకాలిరా అన్నాడో సినీ కవి.. కొందరు ఎంతటి కష్టంలో ఉన్నా ముఖంపై నవ్వు చెదరనీయరు.. ఏపీలోని ఓజిల్లాలో ఎమ్మెల్యేలు అంతేనంట. ఎప్పుడూ జాలీగా ఉంటారట. అందుకే ఏకంగా సీఎం జగన్ కూడా వారి తీరును మెచ్చుకున్నారట. అలా ఆ జిల్లా ఎమ్మెల్యేలకు ఓ ప్రత్యేకమైన పేరు పెట్టారట. అదే జాలీ బ్రదర్స్ అంట. ఇంతకీ ఆ జిల్లా ఏంటో చెప్పలేదు కదూ.

 

అదే కర్నూలు జిల్లా. ఈ విషయాన్ని ఇదే జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓ సభలో చెప్పారు. " రాయలసీమ, కర్నూలు అంటే సీఎంకు ఎంతో ప్రేమ. అన్ని జిల్లాల కంటే కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు నవ్వుతు ఉంటారని, వీరికి జాలీ బ్రదర్స్‌ అంటూ సీఎం పేరు పెట్టారు. ఇక్కడి నుంచి చక్కటి న్యాయ పరిపాలన ఇస్తూ ముందుకు సాగాలి. మన నాయకుడికి గొప్ప ఘన స్వాగతం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు.. అన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

 

కర్నూలును జ్యుడిషియల్‌ రాజధానిగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. 1856వ సంవత్సరంలోనే బాలగంగాధర తిలక్.. ఇంగ్లీష్‌ అనే భాషను నేర్చుకుంటేనే దేశానికి ప్రగతి ఉండదని ఆ రోజుల్లో పూనాలో దీ ఇంగ్లీష్‌ స్కూల్‌ను స్థాపించారని గుర్తు చేశారు. ఆ సొసైటీలోనే మన ప్రధాని పీవీ నరసింహారావు చదువుకున్నారన్నారు.

 

రాష్ట్రం అంతా కూడా సమానంగా, సమతుల్యంతో ఎలాంటి బేధం లేకుండ అందరిని ముందుకు తీసుకెళ్లాలనే భావంతో ఈ రోజు మూడు రాజధానులు ఏర్పాటు చేసిన సీఎం వైయస్‌ జగన్‌కు ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 90 సంవత్సరాల క్రితమే ఆంధ్రభాష, తెలుగు భాష మాట్లాడే వ్యక్తులకు సమతుల్యం ఉండాలని శ్రీబాగ్‌ ఒప్పందంలో పెద్దలు భావించారు. దాదాపు 90 ఏళ్ల తరువాత ఆ ఆలోచనతో, చిత్తశుద్ధితో కర్నూలును జ్యుడిషియల్‌ రాజధానిగా చేసిన సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలని అన్నారు మంత్రి బుగ్గన.

మరింత సమాచారం తెలుసుకోండి: