దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న నిరుద్యోగం సమస్య గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరికి తెలిసిందే.. ముఖ్యంగా పేదవారి చదువులు, ఉద్యోగాల గురించైతే, పాపం ఇలాంటి వారికి ఇవి అందని పండులాంటివే.. కానీ మంచి అవకాశం దొరికితే తమలోని టాలెంట్ చూపించి జాబ్ కొట్టేయాలని ఎదురుచూసే వారు ఎందరో ఉంటారు.. ఇలాంటి అవకాశాలు ఎప్పుడో ఒకప్పుడు అలా వస్తుంటాయి. ఇదిగో అలావచ్చిందే ఈ అవకాశం.

 

 

అదేమంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగం లేని వారికి ఫ్రీగా ఫుడ్డు, బెడ్డు, ట్రైనింగ్‌తో పాటు.. ఆ వ్యాపారానికి కావలసిన లోన్ కూడా ఇస్తుందట.. సందేహం అక్కర్లేదు. నిరుపేదలు, నిరుద్యోగులు, ఉన్నత విద్యను అభ్యసించలేని వారికి బాసటగా నిలుస్తూ ఈ శిక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చింది ఎస్‌బీఐ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి.. యువతకు తోడ్పాటుగా నిలుస్తోంది.

 

 

ఇకపోతే ఈ కార్యక్రమాలలో భాగంగా దేశ వ్యాప్తంగా, ఇప్పటికే  587 శిక్షణా సంస్థలను ప్రారంభించింది. ఇప్పుడు మరో 151 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణలు ప్రారంభించనుంది. ఈ క్రమంలో ఎన్నో డబ్బులు పోగేసి నేర్చుకునే కోర్సులను ఉచితంగా అందిస్తుండటంతో యువతీ, యువకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ట్రైనింగ్ ముగిసిన తర్వాత వ్యాపారం చేయడం కోసం, ఉద్యోగం కోసం అవకాశాలు కూడా కల్పిస్తోంది ఎస్‌బీఐ సంస్థ.. ఇక ఈ సదుపాయాలు పొందాలంటే, ముందుగా స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్‌ని కలిసి శిక్షణ సంస్థ వివరాలు తెలుసుకుని, ఆయా జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి కావలసిన అర్హతలేంటంటే..

 

 

వయసు 18 నుంచి 31 సంవత్సరాల మధ్య  ఉండటంతో పాటుగా. కనీసం 10వ తరగతైనా పాస్ అయి ఉండాలి. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డ్, 3 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు కావాలి అప్లికేషన్ ఫాంతో జతచేయాలి..  ఇక వీరందించే కోర్సుల వివరాలు.. కంప్యూటర్ హార్డ్ వేర్, నెట్ వర్కింగ్, వ్యవసాయ అనుబంధ వృత్తులు, టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎంబ్రాయిడరీ, కొవ్వొత్తులు, అగరుబత్తుల తయరీ, టూవీలర్ మెకానిజం, సెల్ ఫోన్ రిపేరింగ్ స్కిల్స్, పచ్చళ్లు, మసాలా పౌడర్ల తయరీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.. ఇంకెందుకు ఆలస్యం అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్లండి..

మరింత సమాచారం తెలుసుకోండి: