కొందరికి ఎంత నష్టం జరిగినా బుద్దిమాత్రం రాదు. ఇలాంటి దేశంగా చైనాను పేర్కొనవచ్చూ.. ఒకవైపు కరోన వచ్చి మనుషులు కుక్కలకంటే హీనంగా చచ్చిపోతుంటే, మరో వైపు తన కుటిల బుద్ధిని ప్రదర్శించింది.. ప్రపంచదేశాలన్ని అసహ్యించుకుంటున్న పాకిస్దాన్‌కు దొడ్డిచాటుగా సహయం అందిస్తుంది.. ఇప్పటికే పాకిస్దాన్ చేస్తున్న నష్టానికి, ఆదేశంపై గుర్రుగా ఉన్నా దేశాలలో మన దేశం కూడా ఒకటన్న విషయం తెలిసిందే. తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లుగా ఇప్పుడు పాకిస్దాన్‌లో ఆర్ధిక సంక్షోభం తలెత్తింది. ఇలాంటి దశలో త్వరలో పాకిస్దాన్ పని ముగిసిపోతుందా అనే చర్చలు కూడా సాగుతున్నాయి..

 

 

ఇకపోతే చైనాలో కరోనా వైరస్ పుట్టిస్తున్న మారణకాండ ఇప్పటితో ఆగేలా లేదు.. ఈ విషయంలో గాని, మరే విషయంలో గానీ చైనాకు పాకిస్దాన్ వల్ల ఒరిగేది ఏం లేదు.. కానీ చైనా మాత్రం పాకిస్దాన్‌ను తన మిత్రదేశంగానే భావించి ఓ పనికిమాలిన పని చేసింది. అదేమంటే  హాంగ్‌కాంగ్ జెండాతో ఉన్న నౌకను కస్టమ్స్ విభాగం అధికారులు ఫిబ్రవరి 3న కాండ్లా పోర్టులో పట్టుకున్నారన్న వివరం తెలిసిందే.. ‘డ కుయ్ యున్’ అనే నౌక జనవరి 17న చైనాలోని జియాంగ్‌యిన్ పోర్టు నుంచి బయల్దేరి, కరాచీలోని ఖాసిం పోర్టుకు వెళ్లాల్సింది.

 

 

అయితే కాండ్లా పోర్టులోని జెట్టీలో ఈ నౌక కొన్ని వస్తువులను అన్‌లోడ్ చేయడం కోసం లంగర్ వేసింది. అదే సమయంలో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీలు జరుపుచున్న తరుణంలో ఈ నౌకలో మిస్సైళ్ల తయారీలో ఉపయోగించే కొన్ని పరికరాలు ఉన్నాయని గుర్తించి క్షుణంగా పరిశీలించగా, వేల టన్నుల బరువు ఉండే ఆటోక్లెవ్, ప్రెషర్ ఛాంబర్‌లు బయటపడ్డాయి... వీటిని మిస్సైళ్లను లాంచింగ్ చేయడానికి ఉపయోగిస్తారు.

 

 

ఈ ఘటన ద్వారా ఆయుధాలను అందించడంలో పాకిస్థాన్‌కు చైనా సహకరిస్తోన్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో ఉత్తర కొరియాకు చెందిన ఓ నౌక కూడా ఇలాగే మిస్సైల్ భాగాలను పాక్‌కు మోసుకెళ్తూ కాండ్లా రేవులో పట్టుబడింది.. ఇక చైనాలో ఇంతజరుగుతున్న ఆదేశ ప్రభుత్వానికి బుద్ధిరావడం లేదని నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: