టెలికాం కంపెనీలన్నీ తమ తమ వినియోగదారులకు భారీ  షాక్ లు ఇస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న భారీగా ఛార్జీలు పెంచి వినియోగదారులు అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక భారీగా పెరిగిన ఛార్జీలతో వినియోగదారులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మరో సారి ఈ ఛార్జీల పెంపు ఉండబోతున్నాయని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉన్నందున టెలికాం కంపెనీలు అన్ని ... నెట్వర్క్ ఛార్జీలు పెంచడం తప్ప వేరే దారి లేదు అని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో మరోసారి టెలిఫోన్ బిల్లులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే  డేటా పెంచాయి  టెలికాం రంగ సంస్థలు. కాగా ఇప్పటికే పెరిగిన ఛార్జీలతో మొబైల్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే మరోసారి భారీగా డేటా ఛార్జీల పెంపు ఉంటుందని తెలుస్తోంది. ఈసారి ఛార్జీల పెంపు రెట్టింపు ఉండవచ్చని టెలికాం రంగ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి టెలికాం రంగంలోకి జియో ప్రవేశించక ముందు వన్ జీబీ డేటా కావాలంటే రెండు వందల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి ఉండేది. కానీ 2016 లో టెలికాం రంగ సంస్థల్లో కి జియో  ఎంట్రీ ఇచ్చిన తర్వాత చార్జీలు గణనీయంగా పడిపోయాయి. రోజుకు వన్ జీబీ వరకూ ఖర్చు పెట్టినా నెలకు 200 రూపాయలు మాత్రమే కట్టాల్సిన అవసరం లేదని రిలయన్స్ జియో డేటా కాల్స్ ఉచితంగా అందించింది... టెలికం రంగ రంగా చరిత్రను కొత్త పుంతలు తొక్కింది. ఇక జియో  ప్రభావానికి చాలా టెలికాం రంగ సంస్థలు కూడా మూతపడ్డాయి. 

 

 

 ఇక మూడేళ్లలోనే జియో  వినియోగదారుల సంఖ్య పరంగా నెంబర్వన్ స్థానానికి చేరుకుంది.అయితే జియో  దెబ్బకు తట్టుకొని నిలబడాలంటే విలీనం ఒక్కటే మార్గమని వొడాఫోన్ ఐడియా కలిసిపోయాయి. ఇదిలా ఉంటే గడిచిన 20 ఏళ్ల కాలానికి సంబంధించిన రేడియో తరంగాలు ఇతరత్రా బకాయిల రూపంలో... కేంద్ర ప్రభుత్వానికి టెలికాం రంగ సంస్థలు మొత్తంగా 1.47 లక్షల కోట్లను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎయిర్టెల్ 35 వేల కోట్లు.. వొడాఫోన్ ఐడియా 53 వేల కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి ఉంది. ఛార్జీలను సత్వరంగా చెల్లించాలంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇన్స్టాల్మెంట్ లో చెల్లించకుండా ఒకేసారి చెల్లించాలంటూ తెలిపింది. ఈ క్రమంలోనే కష్టాలను భర్తీ చేసేందుకు మరోసారి భారీగా ఛార్జీలు పెంచేందుకు టెలికాం రంగ సంస్థల సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో గతంలో ఉన్నట్లుగానే పొదుపుగా డేటాను  వాడుకోనే  పరిస్థితులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: