తెలుగుదేశంపార్టీని నమ్ముకుని శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ నిండా ముణిగిపోయినట్లే అనుమానంగా ఉంది. సెలక్ట్ కమిటి ఏర్పాటు చేయించటంలో ఫెయిలైన మండలి ఛైర్మన్ చివరకు రాష్ట్ర గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ను కలిసి మొరపెట్టుకున్నారు. తన మాట మండలి కార్యదర్శి వినటం లేదు మహాప్రభో మీరే దిక్కు అంటూ చివరకు గవర్నర్ ను కలవటంలోనే  ఛైర్మన్ తన చేతకానితనాన్ని తానే బయటపెట్టుకున్నారు.

 

ఛైర్మన్ ఇంత ధీనస్ధితికి కారణం ఏమిటంటే నిబంధనలకు విరుద్ధంగా అధికారపార్టీని ఇబ్బందులు పెట్టాలని అనుకోవటమే. నిజానికి నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళేంత సీన్ నిజానికి షరీఫ్ కు లేదు. జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు ఛైర్మన్ ను తెరవెనుక నుండి ఆడిస్తున్నారు. అధికారపార్టీకి వ్యతిరేకంగా వెళ్ళాలని ఎవరూ అనుకోరు. అలాంటిది ఛైర్మన్ వెళుతున్నారంటే బంపర్ మెజారిటితో జగన్ సిఎం అవ్వటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఆ ఉక్రోషమే మండలిలో మెజారిటి ఉందన్న ఏకైక కారణంతో ఇబ్బందులు పెట్టాలన్న పిచ్చి ఆలోచన.

 

గవర్నర్ ను కలసిన ఛైర్మన్ మాట్లాడుతూ తాను రెండుసార్లు సెలక్ట్ కమిటి ఏర్పాటు చేయమని ఆదేశించినా కార్యదర్శి చేయలేదని ఫిర్యాదు చేయటంలోనే ఆయన చేతకానితనం బయటపడింది. నిబంధనలకు అనుగుణంగా ఉంటే కార్యదర్శి ఛైర్మన్ ఆదేశాలు పాటించకుండా ఉంటారా ? పైగా సెలక్ట్ కమిటి ఏర్పాటుపై ఇచ్చిన ఆదేశాలు ఏ విధంగా నిబంధనలకు విరుద్ధమో ఛైర్మన్ ను కలిసి కార్యదర్శి చెప్పినా ఛైర్మన్ వినలేదు.

 

మొదటిసారి వినకపోగా రెండోసారి మళ్ళీ  ఆదేశాలను జారీ చేయటం, ఆదేశాలు అమలు చేయకపోతే యాక్షన్ తీసుకుంటానని బెదిరించటమే విచిత్రంగా ఉంది. ఛైర్మన్ కు తోడు యనమల అండ్ కో కార్యదర్శిని బ్లాక్ మెయిల్ చేయటంతో వివాదం బాగా ముదిరిపోయింది. ఈ వివాదం ఇలా ఉండగానే ఐటి రెయిడ్లు ఎపిసోడ్ మొదలైంది. దాంతో టిడిపి దృష్టి మొత్తం దానిపైకి మళ్ళింది. ఎప్పుడైతే సెలక్ట్ కమిటి వ్యవహారం గవర్నర్ కోర్టులోకి వెళ్ళిందో  కార్యదర్శిని తాము ఏమీ చేయలేమని ఛైర్మన్, యనమలకు బాగా  అర్ధమైపోయింది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: