ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు సరిపడా భూములు అందుబాటులో లేవు. కేవలం ఐదారు జిల్లాలలో మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. 
 
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాలలో భూముల లభ్యత ఇతర జిల్లాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. అధికారులు ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ స్థలాలను కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు అందించాలని భావించారు. కానీ భూముల లభ్యత విషయంలో సమస్యలు ఏర్పడుతూ ఉండటంతో సీఎం జగన్ తాజాగా అమరావతి ప్రాంతంలోని భూములను కృష్ణా, గుంటూరు జిల్లాల పేద ప్రజలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఎన్నికల ముందు సీఎం జగన్ నవరత్నాల్లో ఇచ్చిన హామీ మేరకు ఉగాది పండుగ నాటికి రాష్ట్రంలో 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థల సేకరణకు సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు అధికారులతో భేటీ అయ్యారు. ఈ సంవత్సరం మార్చి 25వ తేదీన 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తున్నట్టు జగన్ గత వారం మోదీని కలిసిన సమయంలో చెప్పారు. 
 
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీని సీఎం జగన్ ఆహ్వానించారు. ఇప్పటికే ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. జగన్ 25 లక్షల మంది పేదలకు ఉగాదికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనుండటం పట్ల పేద ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. జగన్ తీసుకున్న నిర్ణయం వలన తమ సొంతింటి కల నెరవేరుతుందని పేద ప్రజలు ఆనందపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: