సైలెంట్ గా ఉంటూనే మాజీమంత్రి, టిడిపి ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు బిజెపికి పెద్ద షాకే ఇచ్చిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని ఉత్తర నియోజకవర్గంలోని కమలంపార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు సుమారు 300 మందిని టిడిపిలో చేర్పించటంతో బిజెపి నేతలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలు గంటానే ఏదో ఓ రోజు వైసిపిలో చేరుతాడని అనుకుంటున్న సమయంలో బిజెపి వాళ్ళని టిడిపిలోకి ఎందుకు తీసుకొచ్చాడు ? అన్న విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది.

 

ఈ చర్చకు సమాధానంగానే గంటానే ఓ మాట చెబుతున్నారట. తాను టిడిపిని వదిలిపెట్టి ఏ పార్టీలోను చేరేది లేదని కచ్చితంగ చెప్పేస్తున్నారట. పార్టీని బలోపేతం చేయటంలో భాగంగానే ఇతర పార్టీల నుండి టిడిపిలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నట్లు కూడా చెప్పారట. సరే ఇదంతా ఎంతవరకూ నమ్మవచ్చో ప్రస్తుతానికి తెలీదు కానీ మరో కీలకమైన కారణం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత గంట వైసిపిలో చేరాలని అనుకున్నది వాస్తవమేనట. కాకపోతే ఫిరాయింపులకు జగన్మోహన్ రెడ్డి గేట్లు ఎత్తలేదు కాబట్టి గంటా పార్టీలోకి రాలేకపోయారు. అదే సమయంలో గంటా రాకను మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అవంతిని కాదని గంటాను పార్టీలోకి తీసుకోవటం జగన్ కు కూడా ఇష్టంలేదట. అందుకనే వైసిపిలోకి  గంట ఎంట్రి కుదరలేదు. ఈ విషయం అర్ధమైపోగానే బిజెపిలోకి జంప్ చేద్దామని కూడా అనుకున్నారడట.

 

అయితే బిజెపిలోకి జంప్ చేస్తే అనర్హత వేటు పడటం ఖాయమని అర్ధమైపోయింది. బిజెపిలోకి ఫిరాయించే వాళ్ళపై అనర్హత వేటు పడకుండా జగన్ ను మ్యానేజ్ చేద్దామని బిజెపి అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు కుదరలేదట. అందుకనే ఆ ప్రయత్నం కూడా మానుకున్నారు. మరిక చేసేదేముంది ? అందుకనే మెల్లిగా టిడిపిలోనే యాక్టివ్ అవుతున్నారు. ఇందులో భాగంగానే  చేరికలను ప్రోత్సహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: