పెళ్లి అనేది ప్రతివారి జీవితంలో ఓ భాగం. తమకు కాబోయే వరుడు గాని, వధువు గాని ఇలా ఉండాలని, అలా ఉండాలని ఎన్నో కలలు కంటారు.. ఊహల్లో విహరిస్తారు. ఇక పెళ్లికి మూహూర్తం సమయం దగ్గర పడుతున్న కొద్ది కలిగే టెన్షన్ మాటల్లో చెప్పలేం. ఇదిగో ఇలాగే ఓ అమ్మాయి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది.. ఇందుకు గాను బందువులకు, స్నేహితులకు పెండ్లి పత్రికలు కూడా పంచి అలసిపోయి ఇంటికి వచ్చిన ఆమె శవంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే..

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన దివ్య (23) గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ, బ్యాంకుకు సమీపంలోనే మొదటి అంతస్తులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.. కాగా వరంగల్ పట్టణానికి చెందిన ఓ వ్య‌క్తితో ఇటీవ‌ల దివ్యకు నిశ్చితార్థం జరిగి, ముహుర్తం కూడా నిర్ణ‌యించారు. మరోవారం రోజుల్లో పెళ్లి ఉండ‌టంతో అంతా పెళ్లి పనుల్లో త‌ల‌మున‌క‌లై పోయారు. ఇక దివ్య కూడా మంగళవారం బ్యాంకులో తనతోటి స‌హోద్యోగుల‌కు శుభలేఖలు పంపిపెట్టి సాయంత్ర‌ ఇంటికి చేరుకుంది. అప్పటికే పెళ్లిపనుల నిమిత్తం బయటకు వెళ్లిన తన తల్లిదండ్రులు కూడా ఇంకా రాకపోవడంతో, కాబోయే భర్తతో ఫోనులో మాట్లాడుతూ టెర్ర‌స్ పైకి వెళ్లింది..

 

 

అలా ఫోన్ మాట్లాడుతున్న దివ్య అంతలో పెద్దగా అరచి, సడెన్‌గా మాటలు ఆపేసింది.. ఆమెకు కాబోయే భర్త ఎంతగా అరచినా అమె మాత్రం ఒక్క మాటకుడా మాట్లాడటం లేదు. వెంటనే ఆమెకు కాబోయే భ‌ర్త‌ బ్యాంకుకు ఫోన్ చేసి ఏం జ‌రిగిందో చూడాల‌ని కోరగా, బ్యాంకు సిబ్బంది దివ్య‌ ఇంటికి వచ్చి చూసే స‌రికి ఆమె రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండ‌టాన్ని చూసి నివ్వ‌ర‌పోయారు. ఆమెనును వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌టంతో వారు కేసు నమోదు చేసి దివ్య‌ మృతదేహాన్ని పోస్టుమార్ట‌మ్‌కు త‌ర‌లించారు.

 

 

దివ్య తల్లిదండ్రులు ఇంట్లో లేని స‌మ‌యంలో దివ్యను పథకం ప్రకారమే హత్య చేసి ఉంటారని, దివ్య త‌ల్లిదండ్రులు ఇచ్చిన స‌మాచారం తో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు మీడియాకు చెప్పారు. ఇకపోతే  దివ్య చావుకు వెంకటేశం అనే యువ‌కుడి వేధింపులే కారణమని అతనే త‌మ కుమార్తెను హ‌త్య చేసాడ‌ని వారు ఆరోపించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: