గత ఏడాది ఏపిలో జరిగిన ఎన్నికల్లో అప్పటి అదికార పార్టీ అయిన టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.  తెలుగు రాష్టాలు విడిపోయిన తర్వాత ఏపికి మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చిన తర్వాత అమరావతి అంటూ రైతులను మోసం చేశాడని.. అభివృద్ది పేరుతో తన ఐనవాళ్లకు డబ్బులు పంచాడని, నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేశాడని.. అందుకే ప్రజలు ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ది చెప్పారని గెలిచిన వైసీపీ పార్టీ నేతలు అంటున్నారు.  ఇదే క్రమంలో వైసీపీ అధినేత ఏపి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ మొదలు పెట్టి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వారికి నేనున్నాన్న భరోసా ఇవ్వడం.. ఒక్కసారి వైసీపీ ఛాన్స్ ఇవ్వమనడంతో ప్రజలు జగన్ వైపు మొగ్గు చూపారు. 

 

ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు.  అనున్న రీతిలోనే సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలనలో దూకుడు పెంచారు.  ప్రజా సంకల్ప యాత్ర సందర్బంగా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు.  ఇదిలా ఉంటే ఏ చిన్న ఛాన్సు దొరికినా.. అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు.  ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాజధాని విషయంపై రైతులను రెచ్చగొడుతూ.. తప్పుడు అరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. 

 

తాజాగా తాను సంపాదించిన అక్రమార్జన వ్యవహారాలు బయట పడుతూ ఉండటంతో, ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త నాటకాన్ని మొదలు పెట్టారని, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆక్ష్న తన ట్విట్ లో "పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పిఎస్ తో రోజుకి పదిసార్లు మాట్లాడేవాడట. ఆ కాల్ లిస్టు బయటకు తీస్తే దోపిడీ సొమ్ము సర్ధుబాట్లపై మరింత సమాచారం బయటికొస్తుంది. 2 వేల కోట్ల అక్రమార్జన నుంచి దృష్టి మరల్చేందుకు ప్రజా చైతన్య యాత్ర అంటూ కొత్త నాటకం మొదలెట్టాడు" అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: