ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది పొందిన తిరుపతి వెంకన్న స్వామిని భక్తులు భక్తి శ్రద్దలతో కొలుచుకుంటారు.  ఆయన సన్నధిలో పూజలు చేసి పులకరించపోతారు.  వెంకన్న సామికి మొక్కుకుంటే తమ కష్టాలు పోతాయని గట్టి నమ్మకం.  గత కొంత కాలంగా తిరుమలలో సన్నిధిలో ప్లాస్టీక్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందట. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించేలా శబరిమల కొండపై తీసుకుంటున్న విధంగా తిరుమలలోనూ చర్యలు చేపట్టాలని గతంలోనే నిర్ణయించిన టీటీడీ, నేటి నుంచి ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించింది. ఇకపై గాజు బాటిల్స్ లోనే మంచి నీటిని విక్రయించాలని కొండపై ఉన్న అన్ని స్టాల్స్ యజమానులకూ ఆదేశాలు అందాయి. వీటిని పాటించకపోతే జరిమానాలు తప్పవని హెచ్చరించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.  తిరుమల గిరులు నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటాయి.

 

ఇక స్వామి సన్నిధిలో ప్లాస్టిక్‌ వాడకం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా స్వామి వారి ప్రసాదం తీసుకెళ్లేందుకు ఇప్పటివరకూ ప్లాస్టిక్‌ కవర్లను ఉపయోగించేవారు. వీటిని కౌంటర్ల వద్ద భక్తులకు విక్రయించేవారు. అయితే తాజాగా వాటి స్థానంలో పేపర్‌ బాక్సులను అదుబాటులోకి తెచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం.   పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్న ప్లాస్టిక్ ను తిరుపతిలో నిషేధించాలని నగరపాలక సంస్థ తర్మానాన్ని అమలు పరిచే విధానంలో కఠిన నియమ నిబంధనలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

 

కాగా, ఈ ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి గరిష్ఠంగా 4 నుంచి 6 గంటల్లో దర్శనం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు, రూ. 300 ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం భక్తులకు 2 నుంచి 3 గంటల్లో దర్శనం చేయిస్తున్నామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ వినియోగించేవారిపై భారీ జరిమానాలు వేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: