ఓ దేశీ ఆవు మామూలుగా అయితే రోజుకు ఎన్నిలీటర్ల పాలిస్తుంది ? ఎంత గొప్పగా మేపినా.. ఎంత మంచి ఆవు అయినా మహా అయితే రోజుకు 10 లీటర్లకు మించి పాలు ఇవ్వడం కష్టం. ఇంకా ఏదైనా అద్భుతం జరిగి.. ఆ ఆవు యజమాని బాగా శ్రద్ధ తీసుకుంటే 15 లీటర్ల పాలు ఇవ్వడం కష్టం. అలాంటిది ఓ ఆవు రోజుకు ఏకంగా 60 లీటర్లు పాలు ఇస్తుంది అంటే నమ్మి విషయమైనా అన్న సందేహాలు చాలా మందిలో కలుగుతాయి. అయితే ఇది వాస్తవమే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే.

 

నేషనల్డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ డీఆర్ ఐ) మూడురోజుల పాటు నిర్వహించిన నేషనల్ డెయిరీమేళాలో ఓ ఆవు ఆ ఘనత సాధించిం ది. 58.86లీటర్ల పాలిచ్చి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది. అందంలోనూ ఆ గోమాత తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఈ సంఘ‌ట‌న హర్యానాలోని క‌ర్నాల్లో ఉన్న జాతీయ పాడి ప‌రిశ్ర‌మ సంస్థ నిర్వ‌హించిన పోటీల్లో జ‌రిగింది. హర్యానాలోని కర్నాల్ జిల్లా దాదూపూర్ గ్రామానికిచెందిన ప్రదీప్ అనే రైతుకు చెందిన హెచ్ ఎఫ్ క్రాస్బ్రీడ్ ఆవు ఈ పాల పోటీలో పాల్గొని ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

 

అలాగే ఈ పోటీలో అదే హ‌ర్యానాకు చెందిన బరణి ఖల్సాకు చెందిన విజేందర్ చౌహాన్ అనే రైతుకు చెందిన మరో ఆవు 58.17 లీటర్ల పాలిచ్చి రెండో ప్రైజును సొంతం చేసుకుంది. ఇక మిగిలిన విభాగాల్లో బ్రీడ్ జాతుల ఆవుల పోటీలు నిర్వ‌హించారు. ఈ పోటీల్లో అంబాలా రైతు జస్దీప్సింగ్ కు చెందిన ఆవు 26.97 లీటర్ల పాలిచ్చి ఫస్ట్ ప్రైజు సొంతం చేసుకుంది. ఇక దేశీయ విభాగంలో తరౌరీకి చెందిన రామ్ సింగ్ ఆవు 21.31 లీటర్ల పాలతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: