ఎప్పుడూ లేనంతగా చంద్రబాబులో భయం ఎక్కువగా కనిపిస్తోంది. తన రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న ఆందోళన ఆయనలో బాగా కనిపిస్తోంది. ఆ భయంతోనే నిర్ణయాలు తీసుకుంటూ తాను ఆందోళన పడుతూ పార్టీ నాయకులను కూడా ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తన మాట చెల్లుబాటు కాకపోవడం, దూకుడుగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం.. పార్టీ పరిస్థితి రోజు రోజుకు ఆందోళనకరంగా ఉండటంతో బాబు లో భయం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారీ భద్రత కల్పిస్తున్నా భయం మాత్రం ఆయనకు పోవడం లేదు. ప్రస్తుతం టిడిపి నాయకులతో పాటు చంద్రబాబు కూడా తనకు కల్పిస్తున్న భద్రతపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 


ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రభుత్వంపై ఈ విధంగానే విమర్శలు చేశారు. కుట్రపూరితంగా చంద్రబాబు లోకేష్ భద్రతను వైసీపీ ప్రభుత్వం తగ్గించిందని, చంద్రబాబుకు టెర్రరిస్టులు, మావోయిస్టులు, స్మగ్లర్ల నుంచి ప్రమాదం ఉందని అందుకే ఆయనకు జెడ్ కేటగిరి భద్రత ఉందని ఆయన చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆయన భద్రతను సగానికి పైగా తగ్గించిందని ఆయన విమర్శలు చేయడంతో దీనిపై డిజిపి కార్యాలయం స్పందించింది. చంద్రబాబు కు భద్రత తగ్గించలేదని, దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీ చంద్రబాబు కు ఇస్తున్నామని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. 


సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం ప్రకారమే మార్పుచేర్పులు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు 183 మంది భద్రతా సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తున్నామని, విజయవాడలో ఉన్నప్పుడు 135 మంది ఆయనకు రక్షణగా ఉంటున్నారని, హైదరాబాద్ లో ఉన్నప్పుడు 48 మందితో భద్రత ఇస్తున్నట్లు ఏపీ డీజీపీ కార్యాలయం వివరణ ఇచ్చింది. అయినా టిడిపి నేతలు మాత్రం బాబుకు భద్రత భారీగా తగ్గించేసినట్టుగా ఆందోళన చేపట్టి అధినేత కు కూడా మరింత భయం పుట్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: