అవును ఇది నిజంగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలకు బిగ్ షాక్ అనే చెప్పాలి. కేవలం ఈ మూడు పత్రికలే కాదు.. పత్రికల సర్క్యులేషన్, రెవెన్యూ గురించి ఆలోచించే ఏ పత్రికకైనా ఇది షాకింగ్ న్యూసే.. అదేంటంటే.. ఏటా పత్రికల ఆదాయంలో పెరుగుదల క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో టీవీ, డిజిటల్ మీడియా ఆదాయంలో చక్కటి పెరుగుదల ఏటా నమోదవుతోంది. 

 

 

ఈ వార్త నిజంగా ప్రింట్ మీడియాకు షాక్ ఇచ్చేదనే చెప్పాలి. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం భారత అడ్వర్టయిజ్ మెంట్ రంగం 68 వేల కోట్లకు చేరిందట. అంటే దేశంలోని అన్ని మీడియా రంగాల ఆదాయం ఇది. ఇందులోనే పత్రికలు, టీవీలు, డిజిటల్ మీడియా యాడ్స్ అన్నీ కలిపి ఉంటాయి. ఈ మొత్తం ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 11 శాతం పెరుగుదల నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఈ పెరుగుదల 15 శాతం ఉంది. 

 

 

 

అయితే ఈ పెరుగుదల అన్ని మీడియాల్లోనూ ఒకేలా లేకపోవడం విశేషం. డిజిటల్ రంగంలో పెరుగుదల ఏకంగా 32 శాతంగా ఉంది. మరో విశేషం ఏంటంటే.. ఈ పెరుగుదల గత కొన్నేళ్లుగా ఇదే తరహా పెరుగుదల ఉండటం విశేషం. ఒక్క డిజిటల్ మీడియా రంగంలోనే దాదాపు 20 వేల కోట్ల ఆదాయం వస్తోంది.  అంటే మొత్తం ఆదాయంలో 20 శాతంగా చెప్పుకోవచ్చు.

 

 

 

 

 

ప్రస్తుతం ఈ 68 వేల కోట్ల ఆదాయంలో అత్యధిక శాతం వాటా టీవీ రంగం దక్కించుకుంటోంది. అయితే టీవీరంగంలో గ్రోత్ రేట్ కూడా డిజిటల్ తో పోలిస్తే తక్కువే. టీవీ రంగంలో పెరుగుదల 8 శాతంగా ఉంది. ఇక పత్రికల విషయానికి వస్తే ఈ పెరుగుదల కేవలం 5 శాతం మాత్రమే కావడం మరో షాకింగ్. అంటే డిజిటల్ మీడియాలో ఏకంగా 32 శాతం పెరుగుదల ఉంటే.. టీవీలో 8 శాతం, పత్రికల్లో 5 శాతం ఉందన్నమాట. 

 

దీన్నిబట్టి చూస్తే ఎడ్వర్ట్ టైజ్ మెంట్ రంగంలో టీవీ, పత్రికల వాటాను అతి కొద్ది కాలంలోనే డిజిటల్ మీడియా ఆక్రమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకనే ఇక పత్రికలు కూడా డిజిటల్ రంగంవైపు దృష్టిసారించక తప్పని పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: