ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఒప్పందాల విషయంలో గత కొన్ని రోజులుగా విద్యుత్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. పీపిఏలను రద్దు చెయ్యాలని జగన్ సర్కార్ భావించడం పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. దీనిపై పలు సంస్థలు కోర్ట్ కి వెళ్ళడం కూడా జరిగింది. ఇక చంద్రబాబు అవినీతి చేసారని, వ్యక్తులకు లబ్ది చేకూరుస్తూ కొందరికి మాత్రమే ఒప్పందాలు ఇచ్చారని ఆరోపిస్తూ వాటిని రద్దు చెయ్యాలని భావించింది జగన్ సర్కార్. దీనిపై కేంద్రం కూడా జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. 

 

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఇప్పుడు సోలార్ విద్యుత్ సంస్థలు సంచలన ఆరోపణలు చేస్తున్నాయని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన ఒక కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. విద్యుత్ వాడుకుని కూడా జగన్ సర్కార్ బిల్లులు కట్టడం లేదని పునరుత్పాదక ఇంధన శక్తి కంపెనీలు కొన్ని ఆరోపణలు చేశాయని వాల్ స్ట్రీట్ పేర్కొంది. ఏపీ విద్యుత్ వాడుకోవడంలోనూ, బిల్లులు కట్టకపోవడంలోను నెంబర్ 1 గా ఉందని వాల్ స్ట్రీట్ పేర్కొనడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వినియోగం విషయంలో ఒక కథనం రాసింది. 

 

భారత ప్రభుత్వం 2030 నాటికి 450 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని అయితే కొన్ని అడ్డంకులు ఈ క్రమంలో ఎదురు అవుతున్నాయని, దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ కంపెనీలకు 1.3 బిలియన్ డాలర్లు బకాయిలు పెండింగ్‌లో బకాయిలు చెల్లించాల్సి ఉందని కథనంలో ప్రస్తావించారు. జగన్ సర్కార్ బిల్లులు కట్టకుండా వేధిస్తున్నట్టు పేర్కొంది వాల్ స్ట్రీట్. అదే విధంగా తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వకపోతే ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు బెదిరిస్తున్నట్టు కూడా వాల్ స్ట్రీట్ తన కథనంలో ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మోడీ ప్రభుత్వానికి సౌర విద్యుత్ పై పెద్ద కలలు ఉన్నాయని కూడా చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: