ప్రత్యర్ధులపై బురద చల్లటంలో తెలుగుదేశంపార్టీ నేతలకు మించిన వాళ్ళు దేశం మొత్తం మీద మరొకళ్ళుండరు. ఈ విషయం గతంలోనే చాలాసార్లు రుజువైంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి విదేశీ ప్రయాణాలపై టిడిపి నేత బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కూడా బురద చల్లుడు కార్యక్రమం క్రిందకే వస్తుంది. పాడిందే పాడరా అన్నట్లుగా తిప్పి తిప్పి రస్ అల్ ఖైమా అనే కంపెనీ చుట్టూనే తిరుగుతుంటుంది వీళ్ళ ఆరోపణలన్నీ.

 

ఇంతకీ విషయం ఏమిటంటే పై కేసులో నిందుతులు కాబట్టి జగన్ అండ్ కో దేశందాటి బయటకు వెళ్ళటానికి భయపడుతున్నట్లు ఆరోపించారు. దావోస్, దుబాయ్, సౌదీ అరేబియా దేశాల్లో జరిగిన పెట్టుబడి సదస్సులకు  హాజరు కాకపోవటానికి అరెస్టు భయమే ప్రధాన కారణమని చెప్పటమే విచిత్రంగా ఉంది.  అప్పటికేదో పెట్టుబడుల సదస్సులకు జగన్ హాజరు కాలేదు కాబట్టే  లక్షల కోట్లు పెట్టబడులు రాలేదన్న అర్ధం వచ్చేట్లు మాట్లాడారు.

 

ఇక్కడ బోండా మరచిపోయింది ఏమిటంటే విదేశాలకు వెళ్ళినంత మాత్రానా జగన్ ను ఎవరూ అరెస్టు చేయరని. ఎందుకంటే సిఎం అయిన తర్వాత జగన్ రెండుసార్లు విదేశాలకు వెళ్ళిన విషయం బోండా మరచిపోయినట్లున్నారు. మొదటిసారి జెరూసలేం వెళ్ళిన జగన్ తర్వాత అమెరికాకు కూడా వెళ్ళారు. పై రెండు పర్యటనలు కూడా వ్యక్తిగత హోదాలో వెళ్ళినవే. మరి అప్పుడు ఎందుకు జగన్ ను అరెస్టు చేయలేదు ?

 

అప్పుడే అరెస్టు చేయని జగన్ ను పెట్టబడుల సదస్సులకు హాజరైతే అరెస్టు చేస్తారా ?  ఏదో అర్ధంలేని ఆరోపణలు చేసి బురద చల్లేయటం టిడిపి నేతలకు అలవాటే. ఆ మాటకొస్తే దావోస్ లో జరిగిన పెట్టుబడుల సదస్సులకు వరుసగా హాజరైన చంద్రబాబు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారో బోండా కానీ టిడిపి నేతలు కానీ చెప్పగలరా ? చినబాబు లోకేష్ దావోస్ పర్యటన వల్ల రాష్ట్రానికి జరిగిన లాభమేంటో చెప్పగలరా ?

మరింత సమాచారం తెలుసుకోండి: