అయోధ్య భూభాగంపై ఎన్నో దశాబ్దాల పాటు కొనసాగిన వివాదం మొన్నటికి మొన్న సద్దుమణిగిన విషయం తెలిసిందే. అయోధ్య విభాగంలో బాబ్రీ మసీదు నిర్మించారని ముస్లింలు లేరు రామమందిరం నిర్మించాలి అని హిందువులు మధ్య తలెత్తిన వివాదం ఎన్నో దశాబ్దాల పాటు రగులుతూ వచ్చింది. ఈ క్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో  ఈ కేసుపై విచారణ మూడు పదుల సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వచ్చింది. ఇక మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు అయోధ్య భూభాగంపై మరోసారి విచారణ జరిపి చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే అయితే అయోధ్య భూభాగం  తమదేనంటూ ముస్లిం సంస్థలు  నిరూపించుకోకపోవడంతో... వివాదాస్పద అయోధ్య భూభాగం హిందువుల కు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 

 

 ఇదే క్రమంలో అయోధ్యలోని బాబ్రీ మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు కొంత భూమిని కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుపై హిందువులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఇకపోతే  ఈ అయోధ్య భూభాగంలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే  రామమందిర నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయోధ్య ట్రస్టుకు చైర్మన్గా పరవశన్  ఉన్నారు. కాగా హిందువులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్యలో రామమందిరం నిర్మాణం ముహూర్తం  ఎట్టకేలకు ఖరారైంది. 

 

 

 అయోధ్య భూభాగంలో ఏప్రిల్  రెండవ తేదీన రామమందిరం కి ముహూర్తం ఖరారు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సత్వరంగా అయోధ్య ట్రస్ట్ ద్వారా  రామమందిర నిర్మాణాన్ని  పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. కాగా ఇప్పటికే అయోధ్య భూభాగంలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సదస్సుకు ఎన్నో విరాళాలు కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఎంతో మంది ముస్లిం ప్రముఖులు కూడా రామమందిరం నిర్మాణానికి విరాళాలను అందజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: