హైదరాబాద్ నగరంలో తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులు పొందినట్లు ఆధార్ సంస్థ గుర్తించింది. దీంతో ఈ సందర్భంగా ఆ విధంగా ఆధార్ కార్డు పొందిన వారు 127 మంది కి నోటీసులు జారీ చేసింది. ఈనెల 20వ తారీఖున రంగారెడ్డి జిల్లా బాలాపూర్ రాయల్ కాలనీ లో మెగా గార్డెన్ లో హాజరవ్వాలని నోటీసులో పేర్కొంది. ఈ సందర్భంగా విచారణ కు వచ్చేటప్పుడు మీరు భారతీయుల్లో కాదో నిరూపించుకునేందుకు పౌరసత్వాన్ని గుర్తించే విధంగా ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకురావాలని 127 మందికి ఆధార్ సంస్థ తెలియజేసింది. ఒకవేళ భారతీయుడు కాకపోతే చట్టబద్ధంగానే దేశంలోకి అడుగు పెట్టినట్లు నిరూపించుకునే విధంగా డాక్యుమెంట్లు తీసుకురావాలని ఆధార్ సంస్థ తెలిపింది.

 

ఆధార్ సంస్థ యుఐడిఎఐ సోషల్ మీడియాలో వ‌రుస ట్వీట్లతో ఈ విషయాన్ని తెలిపింది. మరోపక్క మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నట్లు కూడా యూఐడీఏఐ చెప్పింది.  ఒకవేళ పౌరసత్వం నిరూపించుకో కాకపోయినా...సరైన డాక్యుమెంట్లు చూపించకపోయినా ఆరోపణలు తోసిపుచ్చిన అందుకు ఎలాంటి ఆధారాలను చూపించినందుకు రూ 29 ప్రకారం ఆధార్ కార్డు రద్దు చేస్తామని ఆధార్ సంస్థ తెలిపింది. అయితే మరోపక్క ఆధార్ కార్డు పౌరసత్వం కాదని మరోపక్క పౌరసత్వం నిరూపించుకోవాలి అంటే ఆధార్ కార్డు చూపించాలని అడగటం లో ఆంతర్యమేమిటని ఆధార్ సంస్థ పై విమర్శలు వస్తున్నాయి.

 

దీంతో అర్థం పర్థం లేని నోటీసులు పంపించిన ఆధార్ సంస్థపై న్యాయపోరాటం చేయాలని నోటీసులు అందుకున్న హైదరాబాద్ కి చెందిన వాళ్ళు రెడీ అవుతున్నారు. దీంతో ఈ వార్త పై హైదరాబాద్ నగరంలో ఉన్న ముస్లింలు కంగారు పడుతున్నారు. మరోపక్క ఇది కేంద్ర ప్రభుత్వం కుట్ర అని ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశంలో ప్రజల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఈ వార్త ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మీడియా వర్గాల్లో వైరల్ న్యూస్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: