ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే స్థానిక సమరానికి తెరలేచింది. ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపు అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పంచాయతీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్, ఎంపీటీసీలు, జడ్పిటిసి లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే కోర్టు నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఇక్క‌డ స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాలి.



ఈ ఎన్నిక‌ల‌ను మీడియా, రాజ‌కీయ మేథావులు అంద‌రూ జగన్ తొమ్మిది నెలల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న ఈ సారి ఈ ఎన్నిక‌ల‌ను క‌సితో తీసుకోవాల‌ని భావిస్తోంది. చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప్ర‌జాయాత్ర అంటూ ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై కొన్ని విష‌యాల్లో వ్య‌తిరేక‌త ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అన్ని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించ‌డం జ‌గ‌న్‌కు పెద్ద స‌వాల్‌గా మారింది.



అయితే ఈ ఎన్నిక‌ల్లో గెలిచే బాధ్య‌త‌ల‌ను జగ‌న్ జిల్లాల వారీగా మంత్రుల‌కు అప్ప‌గించేశార‌ట‌. ఎన్నికల్లో వారి పనితీరును బట్టే భవిష్యత్తులో పదవులు ఉంటాయని స్పష్టంచేశారు. పైగా రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఇప్పుడున్న మంత్రుల్లో 90 శాతం మందిని మార్చేస్తాన‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలోనే మంత్రులకు ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల టెన్ష‌న్ ప‌ట్టుకోవ‌డంతో వారు ఇప్ప‌టి నుంచే క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.



ఇప్పుడున్న మంత్రుల్లో జ‌గ‌న్ కొంద‌రిని ఖ‌చ్చితంగా మారుస్తారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పలువురు మంత్రుల భవితవ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక కొంద‌రు ఎమ్మెల్యేలు సైతం ఈ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించి.. మంత్రులు అవ్వాల‌ని క‌ల‌లు కంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: