మనదేశంలోని వేశ్యాగృహలలో ఉన్న ఆడవారంతా అపహరణకు గురైన వారే. నగరాలలో ఎన్నో ముఠాలు మైనర్ బాలికలను ఎత్తుకెళ్లి బ్రోతల్ హౌజులలో అమ్మేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఒక్కసారి వేశ్యనిర్వాహకులకు దొరికితే, వారి నుండి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఇలాంటివి మనదేశంలో ఎన్నో జరుగుతున్నా బాలికల అక్రమ రవాణాను ఎవరు శాశ్వతంగా అరికట్టలేకపోతున్నారు. ఎప్పుడో ఒకసారి, ఎవరో ఒకరు సహాయం చేస్తే అదృష్టవంతులైన కొంతమంది బాలికలు ఆ రొంపిలోంచి బయటపడగలుగుతారు. ఈసారి ఆ అదృష్టవంతురాలలోని ఒకరు ఎవరంటే కలకత్తాకు చెందిన సులేఖ(పేరు మార్చబడినది).



వివరాలు తెలుసుకుంటే... గతంలో సులేఖ తన కుటుంబంతో కలిసి హల్దీరామ్ లో నివసించేది. తన తల్లీ అటుకులు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేది. కొన్నేళ్ల క్రితం సులేఖ తండ్రి చనిపోవడంతో సులేఖ నానమ్మ పెత్తనం చేయడం కొనసాగించింది. తల్లి కూడా తన నానమ్మకి ఎదురు తిరగలేకపోయేది. ఆ ఇంట్లో ఆమె చెప్పిందే ఎవరైనా వినాలి. అయితే ఒకరోజు ఆ నానమ్మ సులేఖను ఇంటి నుండి బయటకు గెంటివేసింది. అప్పుడు సులేఖకు కేవలం 15ఏళ్లు మాత్రమే. దీంతో ఆమెకు ఎక్కడికి పోవాలో తెలియక మెచ్చెద రైల్వేస్టేషనకు వెళ్లి అక్కడ ఏదైనా పనులు దొరుకుతాయేమోనని వెతకసాగింది. ఆ సందర్భంలో ఇద్దరు మగవారు ఆమె వద్దకు వచ్చి ఒక ఇంటిలో పనిమనిషిగా చేసేందుకు ఒక యువతి కావాలని... దానికి తను కరెక్టుగా సరిపోతుందని ఆమెకు వలవేసి తమతో పాటు పట్టుకెళ్లారు. కొంత సమయం తర్వాత, వాళ్లు ఆమెను ఒక భవనం లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. ఎంతో ఆకలిగా ఉన్న సులేఖ భోజనాన్ని తిని, నిద్రలోకి జారుకుంది. లేచిన తర్వాత ఆమె ఒక చీకటి గదిలో ప్రత్యక్షమైంది.



అప్పుడే తాను ఒక వ్యభిచారగృహంలో ఉన్నానని తెలిసిపోయింది. దీంతో ఆమె గుండె ఒక్కసారిగా బద్దలయింది. ఏం చేయాలో తెలియక గదిలోని గోడలు దద్దరిల్లి పోయేలా ఏడ్చింది. ఆమె ఏడుపుని విన్న బ్రోతల్ హౌజు వారు ఆమెను అరవద్దని బెదిరిస్తూ శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత ఆమెతో వ్యభిచారం చేయించారు. ఎన్నోసార్లు ఆ వ్యభిచార కూపం నుండి బయట పడేందుకు ప్రయత్నించినా... ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్(IJM) అనే పేరు గల ఓ ఎన్జిఓ సులేఖ ఉంటున్న వ్యభిచారగృహం గురించి పోలీసులకు సమాచారం అందించింది. తక్షణమే స్పందించిన పోలీసులు... ఆ బ్రోతల్ హౌజుపై రైడ్ చేసి అందులో చిక్కుకుపోయిన పలువురు యువతులను కాపాడారు. తరువాత IJM ఎన్జీవో సంస్థ ఆ యువతులకు ఆశ్రయం కలిగించి ఒక ప్రముఖ బేకరీ షాపులో ఉద్యోగాలు కల్పించింది. అయితే సులేఖకి అప్పటికి 18 సంవత్సరాలు నిండలేదు. దీంతో ఆమె పని చేసేందుకు అనర్హురాలు కాబట్టి.. ఆమెను నరేంద్రపూర్ లోని ఒక ఆశ్రమానికి తరలించి 18ఏళ్ళు నిండిన తరువాత పార్క్ స్ట్రీటులోని ఒక బేకరీ షాపులో ట్రైనింగు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.




ఈ క్రమంలోనే ఆ బాలికకు సుజోయ్ అనే ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు బ్యాగులు కుట్టే షాపులో పనిచేసేవాడు. కాలం గడిచిన కొద్దీ వారిద్దరి మధ్య పరిచయం ప్రేమకి దారి తీసింది. ఒకరోజు పెళ్లి చేసుకుందామా? అని ఆమెను సుజోయ్ అడిగాడు. దీంతో ఆమె తన గతం గురించి చెప్పేసి ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావా? అని ప్రశ్నించింది. అది విన్న సుజోయ్ ఒక చిరునవ్వు నవ్వి 'జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. నీ గతం గురించి నాకు అనవసరం. నిన్ను పెళ్లి చేసుకొని, నీ కోసం ఒక బేకరీ షాపు పెట్టించి నీకు ఏ లోటు రాకుండా, నిన్ను రాణి లాగా చూసుకుంటా', అని చెప్పేసాడు. చెప్పినట్టుగానే సుజోయ్ సులేఖను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సులేఖ కేక్ ట్రైనింగు నేర్చుకునే చివరి దశలో ఉంది. మరోవైపు సుజోయ్ బ్యాగులు కుట్టే షాపులో పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. ట్రైనింగు పూర్తవ్వగానే సొంత బేకరీ షాపు తన భార్యతో పెట్టిస్తానని చెప్తున్నాడు సుజోయ్. IJM సంస్థ వారు కూడా ఈ విషయం తెలిసి సుజోయ్ ని బాగా కొనియాడుతూ తెగ సంతోష పడుతున్నారు. ఏదేమైనా వేశ్య సులేఖ జీవితం సుఖాంతం అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: