జంతువులు జంతువులు అంటూ హేళన చేస్తాం గానీ అవి మనుషులకంటే వెయ్యిరేట్లు నయం అన్న మాట ఒప్పుకోక తప్పదు.. ఎందుకంటే వాటి వైరం క్షణకాలమే. మనుషుల్లా మనసులో పగలు పెంచుకుని కక్ష సాధింపులు ఉండవు.. కాపుకాచి చంపుకోవడాలు ఉండవు.. చచ్చేలోగా పగ సాధించుకోవాలనే పంతాలు ఉండవు. పేరుకే జంతువులు గాని, వాటిని చిన్నచూపు చూసి అవమానించవద్దని ఎన్నో సార్లు రుజువు కూడా చేయబడ్దది..

 

 

ఇకపోతే మనిషికి ఉన్నది, జంతువులకు లేనిది ఒకటే. అదేమంటే అవి మనుషుల్లా అరవలేవు, చెడ్దపనులు చేయలేవు, నమ్మితే చచ్చేదాక పాదాల దగ్గరే బ్రతుకుతాయి. మనుషులు అలా కాదు. అన్నం పెట్టిన చెయ్యినే అడ్డంగా నరికేసే కాలం... మంచి చెడులు తెలిసిన కూడా, మృగాలకంటే హీనంగా ఆలోచిస్తున్న నేటి కాలంలో నిజమైన స్నేహాన్ని గూగుల్లో వెతుక్కోవలసిందే.. ఇకపోతే కుక్కలకు, పిల్లు, కోతులు అంటే అసలే పడదు.. వాటిని చూస్తే చాలూ తరిమి తరిమి కొడతాయి.. అలాంటిది ఒక కుక్క కోతి స్నేహాన్ని చూస్తే ముచ్చటేయడమే కాదు. మనుషుల కంటే మేము నయం అని వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

 

 

అందులో కోతిచేతిలో బన్ను ఉన్న ఆ కుక్క కాస్తకూడా తన ప్రతాపాన్ని చూపించకుండా నింపాదిగా చూస్తూ ఉంది. ఈ దృష్యాన్ని చూస్తే మాత్రం నిజమైన స్నేహానికి అర్ధం ఈ జంతువులు అనిపిస్తాయి. ఇకపోతే ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో కుక్క మీద కుర్చున్న ఆ కోతి పిల్ల.. తాపీగా బ్రెడ్ ముక్కలు తింటూ స్వారీ చేయడం ఆశ్చర్యపరిచింది. చివరికి అది ఆ కుక్కపై మూత్రం పోసినా ఆ కుక్క పట్టించుకోకుండా దాన్ని వీపుపై కుర్చొబెట్టుకుని తిరగడం గమనార్హం..

 

 

మామూలుగా కుక్క అంటేనే కొట్లాటలకు ముందుంటుంది. అలాంటిది, ఈ కోతి తన వీపుమీద కోతి కోతి పనులు చేసిన ఏమి అనకుండా సైలంట్‌గా ఉండటం వాటి మధ్య అల్లుకున్న స్నేహాన్ని సూచిస్తుంది. ఇక మనుషులు చేసే స్నేహంలో స్వార్ధం తప్పక ఉంటుంది. కానీ జంతువుల్లో మచ్చుకైనా ఆ స్వార్దం కనిపించదు.. అందుకే అవి స్నేహితులుగా మారాయంటే దాదాపుగా విడిపెట్టలేవు.. ఇదే మనుషులకు, జంతువులకు ఉన్న తేడా.. ఇకపోతే ఇంత అందమైన స్నేహాన్ని నలుగురికి తెలిసేలా మహేష్ నాయక్ అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: