తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ తనకు జాతీయ రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు చకచకా రాష్ట్ర రాజకీయాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ కు సీఎంగా బాధ్యతలు అప్పగించేందుకు ఒక పక్క రంగం సిద్ధం చేస్తూనే మరో పక్క తన కూతురు కవితను కూడా మళ్ళీ యాక్టివ్ చేయాలని చూస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ గా ఓటమి చెందడాన్ని ఇప్పటికీ కెసిఆర్ కుమార్తె కవిత మర్చిపోలేకపోతున్నారు. ఇక అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆమె ప్రచారానికి వస్తారని ప్రచారం జరిగినా ఆమె మాత్రం దూరంగానే ఉన్నారు.


 ఈ నేపథ్యంలో ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చి ఢిల్లీ రాజకీయాల్లో యాక్టివ్ చేయాలని కెసిఆర్ చూస్తున్నారు. ఈ మేరకు త్వరలో ఖాళీ కాబోయే స్థానాల్లో ఆమెకు అవకాశం ఇవ్వాలని ఆయన చూస్తున్నారు. కానీ కవిత మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభ కు వెళ్లానని,  అసలు తాను ఎంపీ అయ్యే వరకు ఢిల్లీలోనే అడుగుపెట్టని తన సన్నిహితుల వద్ద మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి మళ్ళీ ఎంపీగా గెలిచే ఢిల్లీకి వెళ్తానని ఆమె చెబుతున్నారట.  ఈ నేపథ్యంలో ఆమెకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించే దిశగా కెసిఆర్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 

 

తనకు ఎలాగూ ఢిల్లీ రాజకీయాలకు వెళ్తాను కాబట్టి కూతురుని రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా చేయాలని కెసిఆర్ ఆలోచేస్తున్నారు. ఈ మేరకు ముందుగా ఆమెను ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్ లో కీలక బాధ్యతలు అప్పగించే దిశలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎమ్యెల్సీ గా మంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు కవిత సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రిగా తెలంగాణ లో మరింత పలుకుబడి పెంచుకుని తాను ఓడిన చోటే తన బలం ఏంటో చూపించుకోవాలని ఆమె చూస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: