నిజానికి కాలం ఎంత మారుతూ కొత్త పుంతలు తొక్కుతునా, కొందరు మనుషుల్లో కొన్ని రకాల తప్పుడు భావాలు మాత్రం అంతరించడం లేదు. కొన్నేళ్ళ క్రితం తెల్లదొరలు, కొందరు నల్ల జాతీయాలను ఆఫ్రికా వంటి దేశాలనుండి తీసుకువచ్చి, వారిని బానిసలుగా మార్చుకుని పలు విధాలుగా చిత్రహింసలకు గురిచేసే వారు. అది మాత్రమే కాక, ఇంకొందరు దొరలు అయితే వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం వంటి కిరాతక చర్యలకు పాల్పడేవారు. ముఖ్యంగా దీనికి ఒకే ఒక్క కారణం వర్ణ వివక్ష. ఇది ఎప్పుడో అప్పటి ఇంగ్లీష్ దొరల కాలం లో ఉండడమే కాదు, ప్రస్తుతం ప్రపంచంలోని అక్కడక్కాడ కొన్ని ప్రాంతాల్లో ఈ విధమైన వర్ణ వివక్షకు కొందరు గురవుతూనే ఉన్నారు. అయితే నల్లవారిపై తెల్లవారు ఆ విధమైన నియంతృత్వ ధోరణితో పలు విధాలుగా అణచివేయడాన్ని సహించని అప్పటి ప్రముఖ రచయితల్లో ఒకరైన అలెక్స్ హేలీ, రూట్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. 

 

ఎంతో గొప్ప ప్రాశస్త్యం పొందిన ఆ పుస్తకం కనుక మనం చదివితే, నల్ల జాతీయులు తెల్ల వారి చేతుల్లో బానిసలుగా మారి ఎటువంటి శిక్షలు అనుభవించారో తెలుసుకోవచ్చు. ఇక రాను రాను కాలం మారుతున్నా ఇప్పటికీ కూడా అమెరికా వంటి కొన్ని తెల్ల దొరల దేశాల్లో ఇటువంటి వర్ణ వివక్ష దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే హేలీ రాసిన నవల చదివి ఎంతో చలించిపోయిన అమెరికాలోని న్యూ యార్క్ లో ఉంటున్న నోయిస్ అనే నల్ల జాతీయుడు, తమ జాతి వారు ఎదుర్కొంటున్న వర్ణ వివక్షను గురించి తెలియచేయడానికి తన ఇంటి దగ్గర్లో ఉన్న ఒక తెల్ల జాతి మహిళను కిడ్నప్ చేసి ఆమెకు ఒక వింత శిక్ష విధించాడు. 1977లో వెబ్ సిరీస్ గా రూపాంతరం చెందిన హేలీ నవల రూట్స్ ను ఆమెను చూడాల్సిందే అని సదరు మహిళను నోయిస్ కోరడంతో, ఆమె నిరాకరించి తప్పించుకునే ప్రయత్నం చేసింది, అయితే దానితో ఆమెను ఒక కుర్చీకి కట్టేసి మరీ ఏకధాటిగా 9 గంటల పాటు రూట్స్ వెబ్ సిరీస్ ని తన టివిలో ప్రసారం చేసి చూపించాడు. 

 

ఆపై తన ఇంటికి చేరుకున్న మహిళ, నోయిస్ పై పోలీసులకు కంప్లైంట్ చేయగా, వెంటనే వారు నోయిస్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నల్ల జాతీయులపై జరుగుతున్న వర్ణ వివక్షను ఆమెకు తెలియచేయాలనే ఆమెను కిడ్నాప్ చేసి ఆ వెబ్ సిరీస్ ని చూపినట్లు నోయిస్ చెప్పాడు. అయితే కాసేపటి క్రితం ఈ విషయం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో బయటకు రావడంతో, కొద్దిరోజుల క్రితం అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సుడిగాడు సినిమాలోని ఒక సీన్ లో భారతీయుడి గెటప్ లో ఉన్న నరేష్, ఒక టివి ఛానల్ వ్యక్తికి కొన్ని గంటల పాటు ఏకధాటిగా టివి సీరియల్స్ చూపించడంతో అతడు చూడలేక పడిపోతాడు. ఇక నోయిస్ విషయంలో జరిగిన ఈ ఘటన అచ్చం ఆ సినిమాలోని సీన్ మాదిరిగానే ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: