టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతటి రాజకీయ మేధావో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతటి విపత్కర పరిస్థితితులు ఎదురైనా ఎక్కడా అదరకుండా బెదరకుండా రాజకీయం నడిపించగల సమర్ధుడు. జనాల నాడి ఏ విధంగా పట్టుకోవాలో బాబు కి తెలిసినంతగా మరెవరికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. తనకు, తెలుగుదేశం పార్టీకి జరిగే నష్టాన్ని కూడా ప్రజా సమస్యగా చిత్రీకరించి సానుభూతి పొందగల నేర్పుడు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూసారు. ప్రస్తుతం పార్టీ ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చినా  ధైర్యంగా ఎదుర్కొని పార్టీకి పునర్వైభవం తీసుకురాగలరు. ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ హవా ఎక్కువగా కనిపిస్తోంది. 

 

గత టీడీపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీఎతి వ్యవహారాలు ఇప్పుడిప్పుడే ఐటీ శాఖ తవ్వి తీస్తుండడంతో బాబు లో ఎక్కడలేని ఆందోళన నెలకొంది. బీజీపీ కూడదా ఈ విషయంలో పట్టుదలతో ఉండడంతో బాబు లో భయం కాస్తా ఎక్కువయ్యింది. అయినా వీటినే తనకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న బస్సు యాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీపై జరుగుతున్న ముప్పేట దాడులు గురించి ప్రజా పోరాటాలు చేస్తున్నందుకే కక్ష గట్టి  బిజెపి, వైసిపి కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పుకునేందుకు బాబు సిద్ధం అవుతున్నారు. 


అలాగే త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా చంద్రబాబు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 35 శాతం అయినా సీట్లు సాధించగలిగితే తెలుగుదేశం పార్టీ ఉనికి ఏ డోకా ఉండదని, అదే 50% సీట్లు సాధిస్తే వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారనే విషయాన్ని హైలెట్ చేయవచ్చనే ఆలోచన తో చంద్రబాబు బస్సు యాత్ర మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చేందుకు సాధ్యమవుతుందని బాబు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: