ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీ టూర్ పర్యటన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నేతలు జగన్ ఢిల్లీ టూర్ చాలా సక్సెస్ అయిందని మీడియా ముందు అనేక విషయాలు తెలియజేశారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా సహకారం అందించడానికి జగన్ చేపట్టిన ఢిల్లీ టూర్ చాలావరకు విజయవంతమైందని వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్తులో నీతో కలిసి పనిచేయాలని ఉందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు జగన్ తో మంతనాలు జరిపినట్లు కూడా మాట్లాడారు. ఇటువంటి తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటన ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నేతలు మరొక విధంగా విమర్శలు చేస్తున్నారు.

 

జగన్ చేపట్టిన ఢిల్లీ టూర్ కేవలం స్వలాభం కోసం అంటూ విమర్శలు చేశారు. మేటర్ లోకి వెళితే వైయస్ జగన్ మీద ఉన్న అక్రమాస్తుల కేసులో ఒక కేసు వాన్ పిక్ కేసు. ఈ కేసులో జగన్ తో పాటు చాలా మంది ప్రముఖులు ఉన్న వారిలో ఒకరు ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్. కొద్ది నెలల క్రితం నిమ్మగడ్డ ప్రసాద్ అని విదేశీ పోలీసులు విదేశీ పర్యటన చేపట్టినప్పుడు అరెస్టు చేసి వాళ్ల దేశంలో జైల్లో ఉంచారు. ఆ సమయంలో కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చిన నిమ్మగడ్డ వరప్రసాద్ భారతదేశంలోకి రాలేకపోయారు.

 

అయితే ఇదే సమయంలో ఆ కేసు లో విదేశీ పోలీసులు ఏపీ సీఎం జగన్ ని అరెస్టు చేయాలని భావించినట్లు ఇంటర్ పోల్ లో ఈ వ్యవహారం నడిచినట్లు బోండా ఉమా ఆరోపణలు చేశారు. ఇందుమూలంగా తనని అరెస్ట్ చేస్తారేమో అన్న భావంతో జగన్ ఢిల్లీ టూర్ చేపట్టినట్లు బోండా ఉమ తెలిపారు. విదేశాలలో అడుగుపెడితే కచ్చితంగా జగన్ ని అరెస్ట్ చేయడం గ్యారెంటీ అన్నట్టు బోండా ఉమా కామెంట్లు చేశారు. ఇటువంటి తరుణంలో విదేశాల్లో జగన్ అడుగుపెడితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటే..అసలు భారత ప్రభుత్వం జగన్ కి పాస్ పోర్ట్ ఎందుకు ఇవ్వటం జరుగుతుంది అంటూ బోండా ఉమ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు వైసీపీ అభిమానులు మరియు నాయకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: