శృంగారం ప్ర‌తి మ‌నిషి జీవితంలో కీల‌క పాత్ర‌ను పోషిస్త‌ది. ఇక దీని కోసం మ‌నం తినే ఆహారం కూడా ముడి ప‌డి ఉంటుంది. మ‌నం తీసుకునే ఆహారంతో మ‌న శ‌రీరంలోని ప్ర‌తి ర‌క్త ప్ర‌క‌స‌ర‌ణ జ‌ర‌గ‌డం. అవ‌య‌వాలు ప‌నిచేయ‌డం అన్నీ జ‌రుగుతాయి. 

 

మ‌నం ప్ర‌తిరోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల రెడ్ వైస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే కావచ్చు. కానీ అంతకు మించిందంటే మాత్రం లైంగిక చర్యకు ముప్పే. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల డిప్రెషన్ కు గురవుతారు. తద్వారా లైంగిక హార్మోన్ల విడుదల మందగిస్తుంది. కాబట్టి ఆల్కహాల్ కు దూరంగా ఉండ‌డం మంచిది.

 

ఇక మార్కెట్లో దొరికే చీజ్ ను ఆవు పాలతో తయారు చేస్తారు. ఇవి సహజమైన పాలైతే ఇబ్బంది ఉండదు, కానీ ఆవులకు ఆర్టిఫిషియల్ హార్మోన్లు ఇంజెక్ట్ చేసి తీసిన పాలతో చీజ్ తయారు చేయడం ఈ మధ్య ఎక్కువైంది. ప్రాసెస్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కోరికలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే చీజ్ తక్కువగా తీసుకోవడం మంచిది.

 

సోయా ఉత్పత్తులు మన ఆరోగ్యానికి చాల మంచివి. దీని వల్ల మంచి జరుగుతుంది. కాదని వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు చాల మంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే సోయా ఉత్పత్తులన్నీ ఎక్కువగా ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల వాటిలోని మంచి గుణాలన్నీ తొలగిపోతాయి. అంతే కాదు, సోయాలో ఉండే ఫైటోఈస్టొజెస్ లైంగిక పటుత్వాన్ని తగ్గిస్తుంది.

 


కూల్ డ్రింక్స్  వల్ల ఒబేసిటీ, డీహైడ్రేషస్ వంటి సమస్యలు ఉత్పన్నమవడమే కాదు, లైంగిక కోరికలు కూడా తగ్గిపోతాయి. ప్యాక్ చేసిన ఆహారం తినడం వల్ల మన ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఇబ్బందులే ఎదురవుతాయి. అది మన బరువు ను పెంచుతుంది. బీపీని పెంచుతుంది. దాంతో పాటు లైంగికారోగ్యం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. వీటిలో ఉండే సోడియం లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే వీలైనంత తక్కువగా వీటిని తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: