భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఎంత సింపుల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఒక సాధారణ బీద కుటుంబం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగి రాజకీయ నేతగా అందరి మన్ననలు పొందుతూ.. ప్రధాని స్థాయికి ఎదిగారు.  ప్రజల నమ్మకాన్ని చూరగొన్నందుకు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయనను రెండవ పర్యాయం ప్రధానిగా ఎన్నుకున్నారు.  ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఎన్నో వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు.  స్వచ్ఛభారత్, పెద్ద నోట్ల మార్పు మరికొన్ని సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతూ వచ్చారు.  తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని హునార్ హాట్ హస్తకళా వేదికను ఆకస్మికంగా సందర్శించారు.

 

హఠాత్తుగా ప్రధాని రావడంతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.  అయితే అక్కడి ప్రాంతం అంతా కలియదిరిగారు ప్రధాని.  హస్త కళాకృతులు అమ్ముతున్న దుకాణాలను పరిశీలించారు. అక్కడివారితో మాట్లాడారు. తర్వాత హునార్ హాట్ మధ్యలో ఉన్న ఓ ఓపెన్ హోటల్ లో స్నాక్స్ తిన్నారు. నులక మంచం, వెదురు కుర్చీలపై ప్రధాన మోదీతోపాటు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూర్చున్నారు. ‘లిట్టి చోఖా’ను తిని, ‘కుల్హాద్’ చాయ్ తాగారు. తాను తిన్న స్నాక్స్ కి ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా బిల్లు చెల్లించారు.  రెండు ప్లేట్ల లిట్టి చోఖాకు రూ.120, రెండు కుల్హాద్ టీలకు రూ.40 చెల్లించారు. 

 

అయితే ప్రధాని నిడారంబరత ఎంత గొప్పదో అక్కడి షాపులు నిర్వహిస్తున్న వారు చెప్పుకుంటున్నారు.  ఇక లిట్టి చోఖా విషయానికి వస్తే.. గోధుమ పిండితో గుండ్రంగా చేసి, దానిలో పప్పులు, మసాలాలతో చేసిన కర్రీని పెట్టి నూనెలో వేయిస్తారు. దానిని లిట్టీ అంటారు. ఇది చోఖా లో నంజుకొని తింటారు. ఇది టమాటాలు, ఆలుతో చేసే ఓ ప్రత్యేకమైన కర్రీ. బిహార్, జార్ఖండ్, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో ఇది సంప్రదాయ వంటకం.

మరింత సమాచారం తెలుసుకోండి: