అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24వ తేదీన తన సతీమణి మెలానియాతో కలిసి వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇండియాలో అడుగుపెట్టనున్నారు. బోయింగ్ 747 - 200బీ సిరీస్ విమానంలో ఢిల్లీకి ట్రంప్ రానున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ట్రంప్ ఈ విమానంలోనే వెళతారు. ట్రంప్ పర్యటనలో ఎయిర్ ఫోర్స్ వన్ గా పిలవబడే ఈ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 
 
ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ విమానం గురించి చెప్పాలంటే ఈ విమానం ఎగిరే శ్వేత సౌధమనే చెప్పాలి. ఈ విమానానికి గగనతలంలో ఇంధనం నింపే సౌకర్యం ఉంది. ఈ విమానంపై "united states of amerikaa" అక్షరాలు, అధ్యక్షుడి ముద్రతో ఉండే ఎయిర్ ఫోర్స్ వన్, అమెరికా జాతీయ జెండా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అధునాతన సెక్యూర్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఈ విమానం యొక్క మరో ప్రత్యేకత. 
 
అమెరికాపై ఒకవేళ దాడులు జరిగితే మాత్రం మొబైల్ కమాండ్ సెంటర్ గా కూడా ఈ విమానం పని చేయగలదు. విమానం లోపల ఫ్లోర్ ను మూడు భాగాలుగా విభజించి ఎక్స్ టెన్సివ్ సూట్ లో అధ్యక్షుడి కోసం పెద్ద ఆఫీస్, కాన్ఫరెన్స్ గది, టాయిలెట్, రెండోది మెడికల్ సూట్, మూడోదానిని వంట కొరకు కేటాయించారు. విమానంలో ఉండే వంటశాలల ద్వారా ఒకేసారి 1000 మందికి వంట చేయవచ్చు. 
 
విమానంలో ఒకేసారి 100 మంది భోజనం చేసే విధంగా ప్రత్యేక డైనింగ్ సదుపాయం కూడా ఉంది. హాల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం ఇందులో మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియోలు ఉన్నాయి.ఈ విమానం యొక్క రెక్కల పొడవు 195 అడుగులు కాగా టేకాఫ్ తీసుకునే సమయంలో విమానం మోయగలిగే బరువు 8,33,000 పౌండ్లు ఉంటుంది. ఎన్నో విశేషాలు ఉన్న విమానంలో ట్రంప్ అతి త్వరలో మన దేశానికి విచ్చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: