ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు . ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గారి పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. పథకాలను ప్రవేశపెట్టడమె  కాదు పకడ్బందీగా అమలు చేస్తున్నా ముఖ్యమంత్రిగా కూడా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ ఏపీ సీఎం జగన్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

 

 

 ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి... పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటు పడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విద్య వైద్యం వసతి ఇలా ప్రతి విషయంలో పేద ప్రజలకు మెరుగైన పాలన అందిస్తారు. ఇక తాజాగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 120 ఏళ్ల లో ఏ ప్రభుత్వం చేపట్టనీ సంచలన  నిర్ణయానికి సిద్ధమయ్యారు. సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు తాజాగా జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అక్రమ రిజిస్ట్రేషన్ లు అన్నింటికీ చెక్ పెడుతూ ఎవరి భూములు వారికే దక్కాలని ఉద్దేశంతో... ఈ సర్వే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది జగన్మోహన్రెడ్డి సర్కార్. ఇక ఈ సర్వే కనుక విజయవంతమైతే అవినీతి అక్రమాలకు అన్నింటికీ చెక్ పడుతుంది. 

 


 తద్వారా అసలైన హక్కుదారులు కి భూమి దక్కుతుంది. అయితే గత 120 ఏళ్ల చరిత్రలో ఏ సీఎం చేయని పనిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసి చరిత్ర సృష్టిస్తున్నారు. బ్రిటిష్ వారి పాలనలో జరిగిన సమగ్ర భూ సర్వే తర్వాత తాజాగా జగన్ పాలనలో మరోసారి భూ సర్వే జరగడం విశేషం. వాస్తవానికి చట్టం ప్రకారం అయితే 30 సంవత్సరాల కొకసారి భూ సర్వే చేపట్టాలి... కానీ ప్రభుత్వాలు మాత్రం తమ స్వలాభం కోసం ఈ సర్వే జోలికి వెళ్లడం లేదు. అయితే గతంలో పాదయాత్ర సమయంలోనే సమగ్ర భూ సర్వే కు హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీంతో తాజా సర్వే 90% భూ వివాదాల సమస్యలు పరిష్కారం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సర్వే విజయవంతమైతే.. గత ప్రభుత్వాలు ఎంత భూమి స్వాహా చేశాయి ఎంత అవినీతి జరిగిందని మొత్తంగా బయటపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: