జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు నుండి వైసిపి పార్టీ అధినేత జగన్ ని టార్గెట్ చేసుకుని భయంకరమైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. 2014 పొలిటికల్ ఎంట్రీ నాటినుండి ఇప్పటివరకు ఎక్కడా కూడా జగన్ గురించి పవన్ కళ్యాణ్ పాజిటివ్ గా మాట్లాడిన దాఖలాలు లేవు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవటాన్ని ముఖ్య పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చంద్రబాబు పై రాష్ట్రంలో వ్యతిరేకత వచ్చినా గానీ దాన్ని డ్రైవర్ చేయడానికి జగన్ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేశారని దానివల్ల 2019 ఎన్నికల్లో పవన్ కి చంద్రబాబు పార్ట్నర్ అనే భద్ర గట్టిగా పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఓటమి పట్ల విశ్లేషించడం జరిగింది.

 

2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా జగన్ పై విమర్శలు చేయడం జరిగింది. ఒక పాలసీ విషయంలో మరియు ఇంగ్లీష్ మీడియం విషయంలో తాజాగా అమరావతి రాజధాని భూముల విషయంలో జగన్ ని ఇరుకున పెట్టడానికి శతవిధాల పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా వ్యవహరించే పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సారి జగన్ విషయంలో చాలా పాజిటివ్ గా ఫస్ట్ టైం మాట్లాడారు. అదేమిటంటే ఇటీవల కర్నూలు పర్యటన పవన్ చేపట్టిన సంగతి అందరికీ తెలిసినదే. సుగాలి ప్రీతి బలహీన వర్గాలకు చెందిన పదోతరగతి అమ్మాయిని 2017 వ సంవత్సరం లో అత్యాచారం చేసి హత్య చేసి చంపేశారు. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ కేసుని నిర్లక్ష్యం వహించడం జరిగింది అంటూ సుగాలి ప్రీతి తల్లి సంచలన కామెంట్లు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ విధంగానే వ్యవహరిస్తుందని పవన్ కళ్యాణ్ దగ్గర తన బాధ తెలియజేయడం జరిగింది.

 

దీంతో కర్నూలు పర్యటన చేపట్టిన పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయితే ఆడపిల్ల భద్రత విషయంలో ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ముందునుండి చెప్పు వచ్చిన జగన్... పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్ కి రెస్పాండ్ అవ్వరు అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జగన్ సర్కార్ సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ టైమ్ లోనే జగన్ సర్కార్ ఈ విషయంలో ఇంత పాజిటివ్ గా బాగా రెస్పాండ్ అయింది అంటూ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పార్టీ నేతలతో అన్నారు అని సమాచారం. అయితే దోషులకు కఠినంగా శిక్షలు పడిన అప్పుడే నిజమైన న్యాయం జరుగుతుందని ఓ ప్రకటనలో పవన్ ఈ విషయం గురించి పార్టీ తరుపున ప్రకటన విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: