మనుషుల పీకలు కోసి పరారవుతున్న సీరియల్ కిల్లర్ ను ఛేదించి పోలీసులు పట్టుకున్నారు. మామూలోడు కాదట  దాదాపుగా 20 ఏళ్లుగా పోలీసుల కళ్ళు కప్పి గొంతులు కోస్తున్నారు. అదృశ్యమవుతున్న మనుషులు ఎక్కడకు వెళుతున్నారా అని నిఘా పెట్టిన పోలీసులకు మొత్తానికి ఆ నరహంతకుడు దొరికాడు. అన్నీ హత్యలు చేస్తున్నది ఒకరే అని తెలుసుకున్న పోలీసులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. 


 

2000 సంవత్సరంలో తొలి హత్య చేసిన నిందితుడు అప్పటి నుంచి దేశం మొత్తంగా తిరుగుతూనే ఉన్నాడు. అనుమానం రాకుండా అక్కడక్కడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతూ హత్యలు చేసేవాడు. అతని తలపై రివార్డు కూడా ఉంది. ఎట్టకేలకు రెండు దశాబ్దాల తర్వాత పోలీసులు ఆ నరహంతకుడిని అరెస్టు చేశారు.

 


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ ప్రదేశ్‌కి చెందిన అవినాష్ కుమార్ పాండే అనే వ్యక్తి సెక్యూరిటీగా ఉంది మరీ హత్యలకు పాల్పడుతూ వస్తున్నాడు. ఓ రోజు అంకిత్‌తో ఆన్‌లైన్ గేమ్‌లో ఓడిపోయిన పాండే.. అతని గొంతుకోసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. అపార్ట్‌మెంట్ పార్కింగ్ ప్రదేశంలో అంకిత్ శవాన్ని పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అతని తలపై రూ.10 వేల రివార్డు కూడా ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోలీసులకు అందిన సమాచారం మేరకు మూడు హత్యలకు పాల్పడిన నరహంతకుడిని దేశ రాజధాని న్యూఢిల్లీలోని కమలా మార్కెట్‌ వద్ద అరెస్టు చేశారు.

 


ఎక్కడైనా హత్యలు చేస్తే అక్కడి నుండి మకాం మారుస్తూ దాదాపుగా 20 ఏళ్లుగా తిరుగుతున్నాడని పోలీసులు వెల్లడించారు. యూపీ నుంచి ముంబై, అక్కడి నుంచి పూణె, ఆ తరువాత రాజ్‌కోట్, బెంగళూరు, ఒడిశా తదితర ప్రాంతాలకు పారిపోయి తలదాచుకునేవాడు. కనీసం సెల్‌ఫోన్ కూడా వాడని హంతకుడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఢిల్లీలో ఉన్నడన్న సమాచారం అందుకున్న పోలీసులు అతనికి అరెస్ట్ చేసారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: