ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న కేజ్రీవాల్ సామాన్యుడు సత్తా ఏంటో మూడోసారి కూడా నిరూపించాడు. ప్రజా సేవ చేయాలని దృక్పథం ఉంటే చాలు రాజకీయ ప్రత్యర్ధులు ఎంతటి బలవంతులైన సునాయాసంగా గెలవచ్చు అనే సూత్రాన్ని ఢిల్లీ ఎన్నికల ద్వారా కేజ్రీవాల్ నిరూపించాడు. ఇక ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానంటూ చెబుతున్న ఆయన ఈ విషయంలో తన మన భేదం లేకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర అధికార పార్టీ బీజేపీతో కూడా కలిసి ముందుకు వెళ్లేందుకు క్రేజీవాల్ సిద్ధమవుతున్నారు.


 ఢిల్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో 62 సీట్లు గెలుచుకున్న క్రేజీవాల్ ఫలితాల తర్వాత ఢిల్లీ అభివృద్ధి కోసం బిజెపితో కలిసేందుకు సిద్ధమంటూ అప్పట్లోనే ప్రకటన చేశారు. తాజాగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక విషయాలపై ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీ అభివృద్ధి కోసం ఒక స్పష్టమైన అంగీకారానికి కేజ్రీవాల్ అమిత్ షా వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అమిత్ షా ఒకరికొకరు తీవ్రస్థాయిలో విమర్సించుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి ఆమ్ ఆద్మీ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది.


 ఢిల్లీ ఎన్నికల్లో గెలుపొంది దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ జెండా రెపరెపలాడించాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నించింది. అయినా ప్రజలంతా కేజ్రీవాల్ వైపే నిలబడ్డారు. ఇప్పుడు స్వయంగా కేజ్రీవాల్ బీజేపీతో కలిసి ముందుకు వెళ్దామని చెబుతుండడంతో బీజెపీ కాస్త ఆలోచనలో పడింది. ఆమ్ ఆద్మీ విషయంలో కాస్తా సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలని బీజేపీ అగ్ర నేతల సైతం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ముందు ముందు ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: