నెల్లూరు జిల్లాలో 35 సంవత్సరాల వయస్సు గల ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆటోడ్రైవర్ హత్యతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. అత్యంత కిరాతకంగా రాఘవ అనే ఆటో డ్రైవర్ ను సంగం మండలంలోని దువ్వూరు కాలువ బ్రిడ్జి సమీపంలో చంపేశారు. ఒక యువతిని పది సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న రాఘవకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక యువతిని ప్రేమించి రాఘవ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 
 
రాఘవ దారుణ హత్యకు గురవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేయగా పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక మహిళతో రాఘవ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమె భర్త రాఘవను దారుణంగా హత్య చేశాడు. రెండు రోజుల క్రితం రాఘవ ఆటోలో వెళుతూ తాను అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై చాక్లెట్ విసరడంతో పాటు గాల్లో మహిళకు ముద్దులు పెట్టాడు. 
 
ఆటోడ్రైవర్ చాక్లెట్ విసరడాన్ని, ముద్దు పెట్టడాన్ని ఆమె భర్త వెంకటేష్ గమనించాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న రాఘవను చంపేయాలని పథకం రచించాడు. సోమవారం రోజు రాత్రి సమయంలో రాఘవ ఆటోలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వెంకటేష్ అతనిపై దాడి చేశాడు. రాఘవ తలపై బలంగా రాడ్ తో కొట్టిన వెంకటేష్ ఆ తరువాత కాలితో గొంతు నులిమి రాఘవను చంపేశాడు. 
 
స్థానికులు నిన్న ఉదయం రాఘవ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ, బుచ్చిరెడ్డిపాలెం ఇన్‌ఛార్జ్ సీఐ, సంగం ఎస్సై పరిశీలించారు. పోలీసుల విచారణలో రాఘవకు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలియగా పోలీసులు ఆ కోణంలో విచారణ జరిపారు. పోలీసులు వెంకటేష్ పై అనుమానంతో అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేశానని వెంకటేష్ అంగీకరించాడు.      

మరింత సమాచారం తెలుసుకోండి: