దేశంలో అనేక ఎన్నికల్లో మొత్తం రాజకీయ వాతావరణాన్ని తన వ్యూహాలతో మార్చేసే సత్తా కలిగిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. తనని నమ్ముకున్న ఎటువంటి రాజకీయ నాయకుడి నైనా అధికారంలో కూర్చోబెట్ట గల షార్పు టీం వర్క్ తో పనిచేసే ప్రశాంత్ కిషోర్ తాజాగా దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కింగ్ మేకర్ కాకుండా కింగ్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు జాతీయస్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. స్వతహాగా బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిషోర్ గతంలో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జెడియు పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించేవాడు. అయితే ఢిల్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ కి రాజకీయ సలహాలు ఇవ్వటం జెడియు- బిజెపి మైత్రి బంధానికి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ పనిచేయడంతో...జేడీయూ అధినేత నితీష్ కుమార్...ప్రశాంత్ కిషోర్ నీ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది.

 

అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకు రావడంతో కేంద్రం యొక్క వైఖరి నీ ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా తప్పు పట్టడం జరిగింది. ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ జేడీయూ, బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ లో కీలక అడుగువేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పారు. ఈ మేరకు ‘బాత్‌ బిహార్‌ కీ’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

 

కోటి మంది యువత అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 20 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలి అన్న ఫార్ములా నీ ప్రశాంత్ కిషోర్ బీహార్ లో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జగన్ లక్నో వెళ్ళినప్పుడు  ప్రశాంత్ కిషోర్ తన తాజా రాజకీయ ఎత్తుగడలు గురించి జగన్ కి వివరించిన సమయంలో అనవసరంగా ఇటువంటి స్టాప్ వేసావు ' వద్దు , ఇబ్బంది పడతావ్ ' పోలిటికల్ స్ట్రాటజీ వేరు పోలిటికల్ దందా వేరు అని శ్రేయోభిలాసిగా జగన్ ప్రశాంత్ కిషోర్ ని వార్న్ చేశాడని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: