అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంపిగులు జరగడం సర్వ సాధారణమైన విషయమే. 2014లో అధికారంలో ఉన్న టీడీపీలోకి ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు జంప్ చేశారో తెలిసిందే. ఇటు టీడీపీ కూడా వైసీపీని వీక్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కో నాయకుడుగా గేలం వేసి లాగేసింది. అయితే అప్పుడు పార్టీ మారిన నేతలు మొన్న ఎన్నికల్లో ఎంతమంది గెలిచారో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే టీడీపీలో గెలిచారు.

 

అయితే చంద్రబాబు చేసిన తప్పునే తాను చేయకూడదని జగన్ సీఎం అయ్యాక, కొత్త రూల్ పెట్టారు. పార్టీలోకి వచ్చేవారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారు. దీంతో వైసీపీలోకి రావాలని అనుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు కాస్త వెనక్కితగ్గారు. కానీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రం వెనక్కి తగ్గకుండా వైసీపీకి మద్ధతు ఇచ్చారు. ఇక ఇక్కడే జగన్ తెలివిగా చేశారు. వంశీని పార్టీలో చేర్చుకోకుండా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు. దీని వల్ల పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండా చేశారు. ఇక వంశీ మాదిరిగానే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా వైసీపీకి మద్ధతు ఇచ్చారు.

 

కాకపోతే వీరు పార్టీలో చేరకుండా మద్ధతు ఇచ్చిన, అది ఫిరాయింపుగానే ట్రీట్ చేస్తున్నారు. వారిని ఖచ్చితంగా వైసీపీ నేతలుగానే చూస్తున్నారు. ఇక వీరిని జంపిగులు కిందే లెక్కబెట్టుకోవడం వల్ల, వచ్చే ఎన్నికల్లో వీరిలో వైసీపీ నుంచి గెలిచే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే? వంశీకే ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గన్నవరంలో వంశీకి సొంత ఇమేజ్ ఉండటం వల్ల ఎలాగోలా గెలిచే అవకాశం ఉందని అనుకుంటే, మద్దాలి గిరికి అలాంటి అవకాశం లేదని చెప్పొచ్చు.

 

ఎందుకంటే గిరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గుంటూరు వెస్ట్ టీడీపీ కంచుకోట. 2014లో కూడా ఈ సీటు టీడీపీదే. ఇక్కడ టీడీపీ అనుకూల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.  పైగా అమరావతి ప్రభావం గుంటూరు మీద బాగా ఉంది. ఇలాంటి పరిస్తితుల్లో మద్దాలి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటి చేస్తే గెలిచే అవకాశాలు లేవని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: