నిక సంస్థల ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి కనీసం డిపాజిట్లు రావనే భయం, బాధతో ఓ మాజీ సీఎం బస్సు యాత్ర చేపట్టడం చూస్తే నవ్విపోదురు గాక నాకేటి నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉందని నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు ఇప్పటి వరకు మూడు లక్షల కోట్ల వరకు అవినీతి సొమ్మును పోగు చేసుకున్నారని ఆమె విమర్శించారు. అటువంటి ఘనుడు ఇప్పుడు సీఎం జగన్ విమర్శించడం విడ్డూరంగా ఉంది అంటూ ఆమె మండిపడ్డారు. అసలు చంద్రబాబు పార్టీకి పనికిరాదని విషయాన్ని రామోజీ, రాధాకృష్ణ కొంతమందికి చెప్పారనే విషయం తన వద్దకు వచ్చిందన్నారు. చంద్రబాబుకి కేసుల భయం ఎక్కువగా ఉందని, అందుకే ఆ భయంతోనే జనం లోకి వచ్చి తిరుగుతున్నారు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. 


చంద్రబాబు ఆర్థికంగా, శారీరకంగా జగన్ తనను పెడుతున్నారంటూ చెప్పుకుంటూ ఓదార్పు పొందుతున్నారని, కానీ మానసికంగా చంద్రబాబు బాధ ఆయన ఖర్మ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. జగన్ ను చూసి చంద్రబాబు చాలా బాధ పడుతున్నారని, ఇంత సిగ్గుమాలిన చర్యలు చంద్రబాబుకి మాత్రమే తెలుసునని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 108 అంబులెన్సు లో ఓ కార్మికుడుని తీసుకు వెళుతుంటే కనీసం దారి కూడా ఇవ్వలేదని విమర్శించారు. 


జగన్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో చేసిన మంచి పనులు చంద్రబాబు సీఎంగా ఉన్నఅన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా చేశారా అంటూ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో 345 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కానీ ఆయన హయాంలో అసలు ఆత్మహత్యలే జరగలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారని బాబు ది
 అబద్ధాల జీవితమని, సింహం లా ఒకరోజు బతికితే సరిపోతుంది అంటూ లక్ష్మీపార్వతి చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐటీ దాడుల్లో బయటకి వస్తున్నవారు  బాబు మనుషులు కదా అని ఆమె ప్రశ్నించారు. 


ఐదేళ్లలో చంద్రబాబు చేసిన ఒక్క మంచి పని కూడా లేదని, మీరు చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని మూలాన కూర్చోబెట్టారని చంద్రబాబు విమర్శించారు.  తన అధ్యక్షా పదవికి ఎక్కడ పోతుందనే భయంతోనే ఇప్పుడు పిచ్చి తుగ్లక్ లా రోడ్డున పడ్డావు అంటూ మండిపడ్డారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్నవహించిన లక్ష్మి పార్వతి ఈ వ్యాఖ్యలు చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: