ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కర్నూల్ పర్యటనలో వైఎస్సార్ కాంగ్రెస్ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఘోర అవమానం జరిగింది . ముఖ్యమంత్రి కాన్వాయి కి ఎదురుగా వెళ్తోన్నసిద్దార్థ్ రెడ్డి ని సీఎం  సెక్యూరిటీ సిబ్బంది పక్కకు తోసివేశారు . సోమవారం ఈ ఘటన చోటు చేసుకోగా , ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో లో సోషల్ మీడియా లో వైరల్ కావడం హాట్ టాఫిక్ గా మారింది . సిద్ధార్థ్ ఇమేజ్ దెబ్బతీసేందుకే పనిగట్టుకుని ఎవరైన ఈ పని చేశారా ? , లేకపోతే పార్టీలోని ఆయన వ్యతిరేకులు ఈ పని చేశారా ?? అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి.

 

సిద్ధార్థ్ రెడ్డి మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, వస్తున్నారు  . అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న నందికొట్కూరు అసెంబ్లీ సెగ్మెంట్  ఎస్సి రిజర్వుడ్ కావడం తో , జగన్ ఆదేశాల మేరకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగిన  ఆర్థర్ గెలుపు కోసం  తీవ్రంగా కృషి చేశారు . అయితే ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆర్థర్, సిద్ధార్థ్ రెడ్డి  మధ్య విబేధాలు తలెత్తడం తో ఇరువురు నియోజకవర్గం పై పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు  .

 

ఒకదశ లో ఆర్థర్ తో వర్గపోరు పడలేక సిద్దార్థ్ రెడ్డి , బీజేపీ లో చేరనున్నారన్న ఊహాగానాలు విన్పించాయి .  అయితే సిద్ధార్థ్ రెడ్డి ఈ ఊహాగానాలు ఖండించారు . అయితే పార్టీ కోసం మొదటి నుంచి అంకితభావం తో పనిచేసిన సిద్ధార్థ్ రెడ్డి కి జగన్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న వాదనలు విన్పిస్తోన్న తరుణం లో కర్నూల్ చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియా లో వైరల్ కావడం ఆయన అనుచరులకు పెద్ద షాక్ అనే చెప్పాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: