ఏపిలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగుర వేసింది.  అప్పటి అధికార పార్టీ  వైసీపీ ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయింది.  అప్పటి అధికార తెలుగు దేశం పార్టీ చేసిన అకృత్యాలు.. దోపిడి విధానం.. నియంతృత్వ దోరణి వల్లనే ఎన్ని్లో ఓటమి పాలైందని రాజకీయ విశ్లేషకులు అన్నారు.  వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది పథకాలకు శ్రీకారం చుడుతున్నారు.  ఇక ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ కి అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు అస్సలు మింగుడు పడకుంటా ఉంది. 

 

ఈ నేపథ్యంలో ఏ చిన్న ఛాన్స్ దొరికినా ఏకేయాలని ప్రయత్నిస్తుంది.  అయితే దానికి కౌంటర్ గా అధికార పార్టీ నేతలు కూడా ప్రతిపక్ష పార్టీకి దిమ్మతిరిగే లా సమాధానాలు చెబుతున్నారు.  తాజాగా ప్రకాశం జిల్లా ప్రజాచైతన్య యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తోకలు కత్తిరిస్తామంటూ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. ఎవరి తోకలు ఎవరు కత్తిరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని బదులిచ్చారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే టీడీపీ పవర్ కట్ చేశారని వ్యాఖ్యానించారు. అధికారం పోయిందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. 40 ఏళ్ల కెరీర్ ఉన్న చంద్రబాబు ప్రతి చిన్న విషయానికి ఆవేశ పడుతున్నారని.. ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. 

 

ఐటీ దాడుల నుంచి దృష్టి మరల్చేందుకే బస్సు యాత్ర చేపట్టారని ఆరోపించారు. చంద్రబాబు బస్సు యాత్రలకు భయపడేది లేదని, టీడీపీ బస్సు యాత్రలను ఎవరూ అడ్డుకోవడంలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు యాత్రను ఎవరూ లెక్కయడంలేదని అంబటి వ్యాఖ్యానించారు. శవరాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని, డబ్బులు వెదజల్లి అధికారం చేజిక్కించుకోవడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. గత కొంత కాలంగా చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్న విషయం తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: