వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరైన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కొడుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి  ఎంతో మంది అభిమానులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. తన మాటలతో తన ప్రసంగాలతో యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇక తన జీవితం మొత్తం జగన్ కి అంకితం అంటూ చెబుతున్నా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రతిపక్షాలపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కేవలం ప్రతిపక్షాలపై నే కాదు ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థపై కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఇంటర్వ్యూ లే కనిపిస్తున్నాయి. 

 


 దీంతో ఎంతగానో క్రేజ్ సంపాదించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాటలు యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక కార్యక్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి అవమానం జరిగింది. మంగళవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని జగన్ కర్నూలు జిల్లాకు వచ్చారు. ఇక ఈ ఈ క్రమంలోనే జగన్ ను కలిసేందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రయత్నించగా సిబ్బంది అతని అనుమతించలేదు. ఇక సీఎం జగన్ను  కలిసేందుకు మరొక సారి ప్రయత్నించాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఈ క్రమంలోనే కాన్వాయ్ వద్ద నడుచుకుంటూ శిబిరం వద్దకు వెళ్తున్న సమయంలో  జగన్ భద్రతా సిబ్బంది సిద్దార్థ్ ను పక్కకు తోసేస్తారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సిద్ధార్థ రెడ్డి వారితో గొడవ పడ్డాడు.

 


 ఈ విషయాన్ని గమనించిన వైసీపీ నేతలు కలుగచేసుకుని సెక్యూరిటీ సిబ్బందికి అసలు విషయం వివరించారు. మరోవైపు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి కూడా సర్దిచెప్పారు . అయితే ఇక్కడ వరకు గొడవ సద్దుమణిగింది. కానీ  ఈ పరిణామాన్ని బై రెడ్డి వర్గం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారని తెలుస్తోంది. వైసీపీ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న మా అన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డినీ  అవమానిస్తారా అంటూ బై రెడ్డి అనుచర వర్గం ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ విజయంలో కీలక పాత్ర వహించిన వ్యక్తులలో ఒకరైన సిద్ధార్థ రెడ్డిని అవమానిస్తారా అంటూ అధిష్ఠానంపై బైరెడ్డి వర్గీయుల మీడియాలో దాడి  చేస్తున్నట్లు సమాచారం. మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ విషయం మారుస్తారా  లేదా మనసులో పెట్టుకుంటారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: