ఈ మద్య దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.  ఓ వైపు మహిళా సంఘాలు ఇలాంటి దారుణాలపై గొంతెత్తి తమ బాధ వెల్లబుచ్చుతున్నారు.  ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. ఎక్కడా ఈ కామాంధులు మారడం లేదు.  ఇక దేశ నాయకులు స్టేజీలు ఎక్కి ఈ అకృత్యాలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి,ఆయన ఆరుగురు కుటుంబసభ్యులపై   బదోహి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.

 

కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, స్వామి చిన్మయానంద ఇప్పటికే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెంగార్ ఇప్పటికే దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా, మరో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠి, ఆయన అనుచరులు ఆరుగురిపై అత్యాచారం కేసు నమోదైంది.    2017లో తనను బంధించి నెల రోజులపాటు ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

 

తాను గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించారని ఆరోపించింది. ఈ నెల 10నే ఆమె ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ రామ్ బదన్‌సింగ్ తెలిపారు.  ఈ నేపథ్యంలో బదోహి సిటీ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే,ఆయన ఆరుగరు ఫ్రెండ్స్ పై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు ఎస్పీ తెలిపారు. సదరు మహిళ స్టేట్ మెంట్ ను మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డ్ చేయబడుతుందపి,ఆ తర్వాత చట్టప్రకారం తదుపరి చర్య తీసుకోనున్నట్లు ఎస్పీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై పలువురు మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆ నాయకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి వారు వెంటనే పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అత్యాచారం కేసులు పెరిగిపోతున్నాయని.. ఇలాంటి వారికి కఠిన శిక్షలు పడితే కానీ బుద్ది రాదని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: