ప్రభుత్వం కొత్త చట్టాలను అమలులోకి తీసుకొస్తున్న కూడా అమ్మాయిల మీద అఘాయిత్యాలు మాత్రం ఎక్కడ తగ్గలేదు. రోజుకో విధంగా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూ వస్తున్నాయి. ప్రతి రోజూ జరుగుతూ ఉన్నాయి.తాజాగా హర్యానాలో రాత్రివేళ మూత్ర విసర్జన కోసం రోడ్డు పక్కకు వెళ్లిన మహిళపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 


పంజాబ్‌కు చెందిన భార్యాభర్తలు ఫిబ్రవరి 16న తమ బంధువులను కలిసేందుకు పానిపట్ వెళ్లారు. రాత్రివేళ బస్సులో ఇంటికి తిరుగు పయనమయ్యారు. భర్త తన స్నేహితుడి నుంచి రూ.20వేల నగదు తీసుకోవాల్సి ఉన్నందున రాత్రివేళ దంపతులిద్దరూ కర్నల్ టోల్‌గేట్ దగ్గర బస్సు దిగి వేచిచూస్తున్నారు. అదే సమయంలో భార్య మూత్ర విసర్జన కోసం పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లింది.అది గమనించిన ఇద్దరు కామాంధులు ఆమెను బెదరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...

 


విషయాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను వెంబడించి కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి, తమ ఫోన్ నంబర్లు రాసిన కాగితాన్ని వదిలి పరారయ్యారు. భార్య ఎంతసేపటికీ రాకపోవడంతో కంగారుపడి వెళ్లిన భర్త ఆమె నిస్సహాయ స్థితిలో కనిపించింది. ఏం జరిగిందని అతడు అడగ్గా తనపై జరిగిన అఘాయిత్యం గురించి వివరించింది. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తారు.

 

 

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు టోల్‌ప్లాజా వద్ద చిప్స్ ప్యాకెట్లు అమ్ముతుంటారని, బాధితురాలు ఒంటరిగా పొదల్లోకి వెళ్లడాన్ని గమనించిన వారు అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కోర్టు వారికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. మహిళలకు ఇంట్లో బయట ఎక్కడా రక్షణ లేకుండా పోయింది ఇప్పుడు మరో మారు ఇలా  జరగడపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: