వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా మాజీ మంత్రి టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆలోచనలు, ఐడియాలన్నీ కాలం చెల్లినవే. యనమల ఇచ్చిన తప్పుడు సలహాల ప్రకారం నడుచుకునే శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ తన పరువు పోగొట్టుకున్నాడు. యనమల తప్పుడు సలహాలను చంద్రబాబునాయుడు గుడ్డిగా ఫాలో అవటం వల్లే చివరకు శాసనమండలి రద్దుకు ప్రధాన కారణమయ్యాడు. అయినా వాస్తవాలు తెలుసుకోకుండా ఇప్పటికీ వాళ్ళిద్దరూ యనమల సలహాలే వింటున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే యనమల మీడియాతో మాట్లాడుతూ  సెలక్ట్ కమిటిపై ఛైర్మన్ ఇచ్చిన రూలింగ్ తిరుగులేనిదంటూ మొండి వాదన వినిపించారు. అసలు విచక్షణాధికారాలే ఛైర్మన్ కు లేదని నిబంధనలు మొత్తకుంటుంటే యనమల మాత్రం తన పాత పాటనే వినిపిస్తున్నారు. సెలక్డ్ కమిటి పై రూలింగ్ ఇచ్చిన సందర్భంలో ఛైర్మన్ డివిజన్ లేదా ఓటింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ విచిత్రమైన వాదనను తెరపైకి తేవటమే ఆశ్చర్యంగా ఉంది.

 

ఏ బిల్లునైనా సరే తనంతట తానుగా సెలక్ట్ కమిటి  పరిశీలనకు పంపే అధికారం ఛైర్మన్ కు లేదన్నది వాస్తవం. సభ్యుడెవరైనా డిమాండ్ చేస్తే మాత్రమే సెలక్డ్ కమిటి పరిశీలనకు పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రతిపాదించాలి. ప్రకటన తర్వాత ఓటింగ్ జరపాలి. ఇవేవీ లేకుండానే రెండు బిల్లులను తన విచక్షణాధికారాల మేరకు సెలక్ట్ కమిటికి పంపేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించటంతోనే కంపు మొదలైంది. పైగా తాను చేస్తున్నది తప్పని తెలిసీ తాను విచక్షణాధికారాలు ఉపయోగిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించిన విషయం అందరూ చూసిందే.

 

 

అన్నింటికన్నా విచిత్రమేమిటంటే ఆర్టికల్ 212 ప్రకారం ఛైర్మన్ రూలింగ్ ను న్యాయస్ధానాల్లో కూడా ఎవరూ సమీక్షించే అధికారం లేదని చెప్పటమే. ఛైర్యన్ ఆదేశాలను ధిక్కరించిన కార్యదర్శికి వ్యతిరేకంగా కోర్టుకు వెళతామని బెదిరించిందే యనమల. అలాంటి యనమలే ఇపుడు ఛైర్మన్ ఆదేశాలను కోర్టుల్లో కూడా సమీక్షించేందుకు లేదని ఎందుకు సొల్లు చెబుతున్నారు. ముందుగా బెదిరించినట్లు కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు ? జరుగుతున్నది చూస్తుంటే యనమలే టిడిపిని నిండా ముంచేసేట్లున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: