మూఢనమ్మకం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వారి పిల్లలను తల్లిదండ్రులు లేని అనాధలుగా మార్చింది.. అతి అనేది ఎప్పటికైనా అనర్ధం అనే విషయాన్ని మరోసారి నిరూపించింది.. కర్నాటకలోని మైసూర్‌లో జరిగిన ఈ ఘటన ఇలాంటి పనులు చేసేవారికి కనువిప్పు కావాలి... ఆ భార్య పెట్టే కండిషన్లు, కాపురాన్నికూల్చి, ప్రాణాలు ఎలా తీసాయో తెలుసుకుంటే బాధతో పాటుగా, జాలి కూడా కలుగుతుంది.

 

 

ఇకపోతే శాంతమూర్తి (40), పుట్టమణి (38) దంపతులకు 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 12, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ఐతే పుట్టమణి అతి చాదస్తం వల్ల వారుంటున్న ఇంటిని ఎప్పుడు శుభ్రత పేరుతో నీట్‌గా ఉంచడమే కాకుండా, కాలకృత్యాలకు వెళ్లినా.. బయటి వ్యక్తులను ముట్టుకున్నా.. స్నానం చేయాలని భార్తా పిల్లలకు కండిషన్లు పెట్టేది. అలా వారంతా రోజుకు కనీసం 10 సార్లు స్నానం చేయాల్సి వచ్చేది. అన్ని సార్లు స్నానం చేయడం వల్ల పిల్లలు చాలా సార్లు అనారోగ్యానికి గురయ్యారు.

 

 

ఐనా అస్సలు వినేది కాదు. ఇదే కాకుండా కరెన్సీ నోట్లను సబ్బు నీటితో శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టేది. ఆమె అతిశుభ్రత వల్ల భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలే.. ఇదే కాకుండా పక్కవారి వీరి ఇంటికి రావాలంటే భయపడేవారట.. ఆమె ప్రవర్తన పట్ల ఎంతాగానో విసిగిపోయేవాడట  శాంతమూర్తి.. పేరులోనే శాంతాన్ని పెట్టుకున్నా ఆయన జీవితం ఎప్పుడు అశాంతితోనే నిండిపోయి ఉన్నది.

 

 

ఈ క్రమంలో ఆ దంపతులిద్దరు పొలం పనులకు వెళ్లగా, అక్కడ కూడా ఇదే విషయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, ఓపిక నశించిన  శాంతమూర్తి. పొలంలో ఉన్న కొడవలితో పుట్టమణిని నరకగా, తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. తర్వాత నేరుగా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయిన శాంతమూర్తి.. ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషయం అప్పటివరకు ఎవరికి తెలియదట. ఇక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు వారి తండ్రి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.

 

 

తీవ్ర భయభ్రాంతులకు లోనైన చిన్నారులు, ఏడ్చుకుంటూ, చుట్టు పక్కల స్థానికులకు తెలుపగా వారు ఇంటికి వచ్చి చూసేసరికి అప్పటికే అతని ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. వెంటనే పుట్టమణి కోసం గాలించగా ఆమె కూడా పొలంలో శవమై కనిపించింది. అతి వల్ల వీరు మరణించగా పిల్లలు అనాథలయ్యారు. చిన్నారుల పరిస్థితిని చూసి స్థానికులు కూడా కంటతడిపెట్టారు... ఇక ఈ విషయాం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చూరికి తరలించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: