రాష్ట్రానికి తొందరలో ఓ మహిళ ముఖ్యమంత్రి కాబోతున్నారా ? జగన్మోహన్ రెడ్డి సిఎంగా ఉండగా మరో మహిళ ముఖ్యమంత్రి ఎలాగవుతారు ? ఇపుడిదే సందేహం అందరిలోను పెరిగిపోతోంది. అసలు మహిళ సిఎం ఎలాగ అవుతారు ? ఎలాగంటే వైసిపి నేత పొట్లూరి వర ప్రసాద్ చేసిన ఓ ట్వీట్ తో సంచలనం మొదలైంది. పివిపిగా బాగా పాపులర్ అయిన ఈ నేత మొన్నటి ఎన్నికల్లో విజయవాడ ఎంపిగా వైసిపి తరపున పోటి చేసి ఓడిపోయారు. ఈయనను రాజకీయ నేత అనేకన్నా బిజినెస్ మ్యాన్ అనటమే బాగుంటుంది.

 

ఎందుకంటే బిజినెస్ సర్కిళ్ళల్లోనే పివిపి బాగా పాపులర్. రాజకీయాలన్నది ఈయనకు ఓ హ్యాబీ మాత్రమే. ప్రముఖ బిజినెస్ మ్యాన్లలో ఒకడవటంతో ఇటు పారిశ్రామికవేత్తలు అటు రాజకీయనేతలతోను బాగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటువంటి వ్యక్తి ఓ తెలుగు మహిళను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారంటే ఏమిటర్ధం ?

 

ఎక్కడో నిప్పు లేనిదే పొగరాదు కదా ? ఇపుడు పివిపి ట్వీట్ ను చూసిన వాళ్ళంతా ఇదే విధంగా చర్చించుకుంటున్నారు. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులను పదే పదే ప్రస్తావిస్తోంది. తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవటం కోసమే జగన్ నరేంద్రమోడి, అమిత్ షా ను కలిసినట్లు టిడిపి మీడియాలో ప్రత్యేకంగా కథనాలు రాయిస్తోంది.

 

జగన్ పై కేసులున్నది వాస్తవం. కేసులు వివిధ దశల్లో కోర్టుల్లో విచారణ దశల్లో ఉన్నాయి. జగన్ పై నమోదైన కేసుల్లో ఎన్ని కొట్టేశారో ? ఎన్ని విచారణలో ఉన్నాయో కూడా స్పష్టంగా చెప్పలేరు. పనిలో పనిగా మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో కూడా జగన్ అరెస్టుకు సంబంధించి ఓ మాటన్నారు. అరెస్టుకు తెగించి కేంద్రం ముందు రాష్ట్ర ప్రయోజనాలపై జగన్  పోరాటం చేయాలని సూచించటం కూడా కలకలం రేపుతోంది.  విషయం ఏమిటంటే పివిపి అయినా ఉండవల్లి అయినా ఏదో గాలివాటుకు మాట్లాడే రకాలు కాదు. ఒక్కళ్ళు ట్విట్ చేయటం మరొకళ్ళు జైలుకు సిద్ధపడాలని జగన్ కు సూచించటమంటే ఏదో జరగబోతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: