నిజంగా సోషల్ మీడియా లో అనేక వేధింపులు ఎక్కువ అయ్యి పోతున్నాయి. ఆడవాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుని అనేక రకాలు గా వేధిస్తున్నారు. ఇది ఎంత మాత్రము మంచి విషయం కాదని చెబుతున్నా వీటికి విరామం మాత్రం లేదు. అయితే తాజా గా మరో విషాధం చోటు చేసుకుంది సోషల్ మీడియా లో. ఇంస్టాగ్రాం లో ప్రేమ పేరున వేధింపులు జరగనున్నాయి. ఇందులో తాజా గా ఓ కేసు బయట పడింది. అయితే ఈమె ఓ విధ్యార్ధి. ఎం.బీ.ఎ చదువుతోంది.
 
 
ముందు ఫ్రెండ్ షిప్ చేసుకున్నాడు. అలా కొన్ని రోజులు స్నేహం చేస్తున్నట్టు నటించాడు. కొంత కాలం తరవాత ప్రేమిస్తున్నాను, పెళ్ళి చేసుకుంటాను అని అడిగాడు. దానికి ఆమె తిరస్కరించే సరికి ఆమెని వేధించడం మొదలు పెట్టాడు. అయితే ఈ బెదిరింపుల కి ఈమె భయం తో స్థానిక పోలీసుల కి ఫిర్యాదు చేసింది.
 
 
అయితే ఈమె ఘట్ కేసర్ మండల పరిధి వెంకటాపూర్ లో ఓ కళాశాల లో చదువుతోంది. బోడప్పల్ కి చెందిన ఏమి 21 సంవత్సరాల యువతి. ఏమె ఆ వ్యక్తి బెదిరింపులు గురించి తన తల్లిదండ్రుల కి చెప్పింది. అయితే వారు అతని కి పలు మార్లు చెప్పారు. కానీ అతని తీరు ఎంతకీ మార లేదు.
 
 
అయితే ఓ నాడు తన కళాశాల కి వెళ్ళి ఫోన్ ని తీసుకుని పెళ్ళి చేసుకోపోతే చచ్చి పోతానని బెదిరించాడు. బెదిరింపుల కి ఈమె భయం తో స్థానిక పోలీసుల కి ఫిర్యాదు చేసింది. ఆమె భయం తో పోలీసుల కి ఫిర్యాదు చేసింది .ఆమె చెప్పిన వివరాల ని పోలీసులు పరిశీలించారు. ఆ వివిరాలని పరిశీలించి పోలీసులు ఆ వ్యక్తి ని అదుపు లోకి తీసుకున్నారు. ఆ విషయం పై చర్చ చేసి ఆ వ్యక్తి పై కేసు నమోదు చేసారు పోలీసులు

మరింత సమాచారం తెలుసుకోండి: