ఒకే సామాజికవర్గం.. ఒకే పార్టీ అయినా గ్రూపు తగాదాలు విషయంలో నాయకుల నాయకులు వారి అనుచరులు వ్యవహార శైలి కారణంగా పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ వివాదాన్ని పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా  ఎక్కడో ఒకచోట గ్రూపు విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే తంతు. ఈ విషయంలో వైసిపి, టిడిపి అనే భేదం లేకుండా అన్ని పార్టీల్లోనూ ఇదే తరహా వ్యవహారాలు తరచుగా చోటు చేసుకుంటూ అధినేతలకు తలనొప్పిగా మారుతుండడంతో పాటు పార్టీ ఇమేజ్ ను ప్రజల్లో మరింతగా పలుచన చేస్తున్నారు. ఈ విషయంలో తప్పు ఎవరిది అన్న సంగతి పక్కన పెడితే నష్టపోయేది అంతిమంగా పార్టీనే.


 తాజాగా ఇదే తరహా సంఘటన ఏపీ అధికార పార్టీ వైసిపి లో జరిగింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు, డిప్యూటీ సీఎం subhash chandra BOSE' target='_blank' title='పిల్లి సుభాష్ చంద్రబోస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పిల్లి సుభాష్ చంద్రబోస్ అనుచరుల మధ్య ఫ్లెక్సీ వివాదం తీవ్ర స్థాయి వరకు వెళ్ళింది. ఈ విషయంలో ఒకరి అనుచరులకు మరొకరి అనుచరులకు మధ్య వివాదం తీవ్ర స్థాయిలో చోటు చేఉకోవడంతో చివరకు పోలీసులు కలుగజేసుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఇంతకీ విషయం ఏంటంటే... తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం లో జిల్లా ఇంచార్జి గా ఉన్న టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి బుధవారం  పర్యటించారు. ఈ సందర్భంగా వేణు , పిల్లి సుభాష్ చంద్ర బోస్ వర్గీయులు సుబ్బారెడ్డికి పోటాపోటీగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 


ఇంత వరకు బాగానే ఉన్నా ఈ ఫ్లెక్సీల్లో subhash chandra BOSE' target='_blank' title='పిల్లి సుభాష్ చంద్రబోస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పిల్లి సుభాష్ చంద్రబోస్ కు చెందిన ఫ్లెక్సీ ఒకటి చినిగిపోవడంతో వివాదం మొదలైంది. కావాలని తమ ఫ్లెక్సీని వేణు వర్గీయులు చించేశారని  ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోస్ వర్గీయులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వివాదం తీవ్ర స్థాయిలోకి  వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుభాష్ చంద్రబోస్, వేణు వర్గీయుల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీ వివాదం మరోసారి గ్రూప్ తగాదాలను బయటపెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: